కొందరికి మాంసం లేనిదే ముద్ద దిగదు, మరికొందరు మాంసం లేకపోతే అసలు భోజనమే చేయరు, ఏదో ఒక నాన్ వెజ్ డిష్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే కార్తికమాసం కదా చికెన్ ధరలు తగ్గుతాయని అందరూ అనుకున్నారు, కాని మార్కెట్లో మాంసాహార ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో చికెన్ వినియోగం బాగా పెరిగింది. దీంతో చికెన్ ధరలు మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి.
నిన్నమొన్నటి వరకూ కిలో చికెన్‌దర 150 నుం 160 రూపాయలు పలికింది. కానీ గత రెండురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ ధరలు కేజీ 210 రూపాయలకు చేరాయి. అంతేకాదు వచ్చే వారానికి 250 పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా నవంబర్ నుంచి డిసెంబర్‌మధ్య చికెన్ ధరలు తక్కువగానే ఉంటాయి. అక్టోబరు నెలలోనే చికెన్ ధర కేజీకి 280 రూపాయల వరకు పలికింది. దసరా సమయంలో ఇలాంటిపరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. నవంబరు, డిసెంబరులో కార్తీకమాసం, అయ్యప్పపూజల కారణంగా మాంసాహారం తినేవారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. దీంతో ధరలు తగ్గుతుంటాయి. కానీ ప్రస్తుతం నవంబరులోనే కిలో 210 రూపాయలకు చేరితే సంక్రాంతి నాటికి ధరలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని అంటున్నారు మాంసాహర వ్యాపారులు.
ఇంతకీ చికెన్ ధరలు పెరగడానికి కారణం? అసలు వీటి నియంత్రణకు ఏమైనా సంస్దలు ఉన్నాయా అనేది చూస్తే?
చికెన్ ధరలు పెరడానికి ప్రధానకారణం హోల్‌సేల్ వ్యాపారులేనని హాచరీస్ నిర్వాహకులు చెబుతున్నారు. కోళ్లపారాల దగ్గర రైతులు ఎన్నో ఇబ్బందులుపడుతూ కోళ్లను పెంచుతున్నారు కానీ హోల్‌సేల్‌వ్యాపారులే ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నట్టు తెలుస్తోంది. చికెన్‌ధరల నియంత్రణకు ఎలాంటి యంత్రాంగం లేదు. పైగా ప్రభుత్వం కూడా ఈ విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫామ్‌హౌస్‌ల దగ్గర ఒక్కో కోడి ప్రస్తుతం 88 రూపాయలుగా పౌల్ర్టీ సంస్థలు చెబుతున్నాయి.
ఈ క్రింద వీడియో చూడండి
కానీ చికెన్ సెంటర్లకు వచ్చేసరికి ధర దాదాపు రెట్టింపు అవుతోంది. దీంతో సామాన్య ప్రజలు చికెన్ తినాలంటేనే పెరిగిన ధరలు చూసి భయపడుతున్నారు. .ప్రస్తుతం ఫామ్ ధర బర్డ్‌కి 88 రూపాయలయితే ఒక్కోబర్డ్ ధాదాపు రెండు కిలోన్నర నుంచి రెండు కేజీలు పడుతుంది. అంటే కీలోకు 40 రూపాయల మేరకు వారు చెల్లిస్తున్నారు. ఇలా హోల్‌సేల్‌వ్యాపారులు రిటైల్‌వ్యాపారులకు ఒక్కోబర్డ్‌కు 150 నుంచి 170 రూపాయలకు అమ్ముతున్నారు. రిటైల్‌వ్యాపారులు వినియోగ దారులకు కిలో 210 రూపాయల అమ్ముతున్నారు. ఇలాదశల వారీగా చికెన్‌ధర పెరుగుతూ వస్తోంది. రోజుకు 12 లక్షలకేజీల చికెన్ తెలంగాణలో వినియోగం అవుతోంది. ఇందులో ఒక్క్క హైదరాబాద్ నగరంలోనే 6లక్షలకేజీల చికెన్ వినియోగిస్తున్నట్టు రికార్డు ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే హైదరాబాద్ నగరంలో చికెన్ వినియోగం అధికంగా వుంది. దేశంలో చికెన్ వాడకం కూడా తెలంగాణ మొదటి స్ధానంలో ఉందట, చూశారుగా ఎంత మంది మాంసాహర ప్రియులు ఉన్నారో. చికెన్ ప్రియులు ఈ వీడియోపై మీ కామెంట్లు తెలియచేయండి.
ఈ క్రింద వీడియో చూడండి
The post బ్రేకింగ్ న్యూస్ చికెన్ ప్రియులకి చేదువార్త తప్పక తెలుసుకోండి appeared first on Telugu Messenger.