మనకు కూతురు లేకపోయినా వచ్చే కోడలిని కూతురిలా చూడాలి అని అనుకుంటారు కొందరు. కోడలు మన ఇంట్లో కలిసి మెలసి ఉండాలి అని, కుటుంబంలో అందరూ భావిస్తారు. అయితే అత్త మామలను కూడా సొంత అమ్మానాన్నలాగా చూసుకోవాలి అని ఆ అమ్మాయి కూడా అనుకోవాలి కదా. కానీ ఈ కాలంలో ఏ కోడలు కూడా అలా అనుకోవడం లేదు. ఇంటికి వచ్చిన కోడలే తమ పాలిట మృగం అయితే, ఆ మృగానికి కన్నకొడుకే సహాయం చేస్తే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఇదే పరిస్థితి ఒక తండ్రికి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ రాష్టంలో ఉండే రామ్ జీ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తూ కష్టపడి, పిల్లలను చదివిస్తూ సొంత ఇళ్లు కూడా కట్టుకున్నాడు. ఇక రిటైర్మెంట్ వయసు వచ్చి, ఆయన ఇంట్లోనే రిటైర్డ్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ సమయంలో ఆయన భార్య ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆయన పెద్ద కొడుకుకు ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక తనకు ఇంట్లో కోడలు ఉంటే తోడు ఉంటుంది అని ఆ తండ్రి ఆశ పడ్డాడు. కానీ పెళ్లైన కొద్దికాలం బాగానే ఉన్నా, ఇంట్లో ఉన్న మామగారిపై ఈసడింపు పెరిగిపోయింది ఆ కోడలికి. అతనికి వయసు పెరిగే కొద్దీ ఆమె అతనికి ఇచ్చే గౌరవం తగ్గిపోతోయింది. నోటికి వచ్చిన మాటలు అనడంతో ఆమె మామగారు ఎంతో కుంగిపోయేవాడు. ముసలివాడివి మూలన పడి ఉండాలి అని తరచూ తన నోటికి పనిచెప్పేది ఆ కోడలు. ఇక భర్తకి కూడా ఇంట్లో ఉన్నవి లేనివి మామగారిపై నూరిపోసేది. ఇవన్నీ విన్న ఆ తండ్రి తనలో తాను కుమిలిపోతూ ఉండేవాడు. కనికరం మానవత్వం లేకుండా 80 ఏళ్లు వచ్చిన ముసలి వ్యక్తిని తాళ్లతో కట్టి ఇంట్లో ఉంచేశారు. ఇంట్లో ఎవరిమీద అయినా కోపం వస్తే ఆ కోపం ఆ ముసలి తాతపై చూపిస్తారు. ఓ కర్ర తీసుకుని వారి కోపం పోయే వరకూ ఆ తాతని కొడతారట. ఈ విషయం చుట్టుపక్కల వారు కూడా గమనించలేదు.కాని ఇన్నాళ్లకు ఈ భార్యాభర్తల బండారం బయటపడింది.
ఈ క్రింద వీడియో చూడండి
దుర్మార్గం, అన్యాయం ఎక్కువ కాలం నిలువదు కదా, ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఓసారి ఈ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ బంధువు, ఆ ముసలి వ్యక్తి ధీన స్ధితిని చూసి ఫోటోలు వీడియోలు తీశాడు. అతని నుంచి జరిగింది తెలుసుకుని బాధపడి ఈ ఫోటోలను బయటపెట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం అక్కడ స్దానికులకు చుట్టుపక్కల వారికి అంతా పాకేసింది. ఇక చివరకు పోలీసులకు కూడా తెలియడంతో, ఆ ఇంటికి చేరుకుని ఆ ముసలి వ్యక్తిని చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇంటికి వచ్చిన సమయంలో ఆ ముసలి వ్యక్తిని చేతులు కట్టేసి ఉంచారు. వెంటనే అతన్ని హాస్పటల్ కు తీసుకువెళ్లారు పోలీసులు. కోడలు కొడుకుని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆ ముసలాయన్ని వృద్దాశ్రమంలో చేర్చారు. తన కోడలు కొడుకు మారరని, నేను వారితో ఉండను అని చెప్పాడు ఆ వ్యక్తి. ఇక్కడ విచారించ దగ్గ విషయం ఏమిటి అంటే? 80 ఏళ్ల ఆ ముసలి వ్యక్తిని ఎందుకు ఇలా ఇబ్బందులు పెట్టారు అని అడిగితే… ఆ కొడుకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. తనతండ్రి మానసిక పరిస్దితి బాగోలేదని, అందుకే తాళ్లతో కట్టాము అని చెప్పారు. చూశారుగా సర్వస్వము తనపిల్లలు అని ఆస్తి సంపాదించి కొడుక్కి ఇస్తే, చివరకు కొడుకు అతను పిచ్చివాడు అనే ముద్ర తండ్రికి వేశాడు.. ఇలాంటి పుత్ర రత్నాలకు ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
ఈ క్రింద వీడియో చూడండి
The post 83 ఏళ్ళ తండ్రిని కట్టేసి కొడుతున్న కొడుకు, కోడలు.. చూస్తే కన్నీళ్ళు ఆగవు appeared first on Telugu Messenger.