ఇటీవల భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. ప్రియుడి మోజులో పడి భర్తని చంపడం, కుటుంబ సభ్యులని హతమార్చడం ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. ఇక పెళ్లికి ముందే అన్నీ ముచ్చట్లు అయిపోయిన కొందరు ప్రేమికులు, వారితో ఉన్న అనుభవాలని మర్చిపోలేక పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలని అబ్బాయిలని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు, ముఖ్యంగా ప్రేమించిన వాడు దక్కలేదు అనే కోపం ఉంటే , ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు అనే భావం కూడా ఉంటోంది.
అనంతపురం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే భర్త హత్యకు భార్య స్కెచ్ వేసింది.16 రోజులు ముచ్చటా తీరలేదు అయినా నూరేళ్ల బంధానికి ఏడు రోజుల్లోనే స్వస్తి పలకాలనుకుంది ఓ భార్య ఏకంగా ఎవరూ చేయకూడని పని చేసింది, ఏకంగా భర్తకు విషం ఇచ్చింది..ప్రస్తుతం ఆ భర్త మాత్రం చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.. తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో లింగమయ్యకు,ఓ యువతితో వారం రోజుల క్రితం వివాహం జరిగింది. వివాహమైన రోజు నుంచే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.. దీంతో ఇంటి కుటుంబసభ్యులు సర్దిచెబుతుండే వారు. కానీ..పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. భర్త పట్ల ద్వేషభావాన్ని పెంచకున్న నవ వధువు ఈరోజు ఉదయం భర్త గదిలోకి విషం కలిపిన పాల గ్లాసుతో వెళ్లి ప్రేమతో మాట్లాడి తాగించింది.. అయితే ప్రేమగా భార్య ఇచ్చిన పాలు తాగాడు భర్త, కాని అందులో కాలకూట విషం తన భార్యే కలిపింది అని అతను ఊహించలేదు.
ఈ క్రింద వీడియో చూడండి
భర్త పాలు తాగి కళ్లు తేలేశాడు..అపస్మారకస్థితి పడి ఉన్న లింగమయ్యను సోదరుడు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యుల వెల్లడించారు. సోదరుడి ఫిర్యాదులో జోన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసి నవ వధువుని అదుపులోకి తీసుకున్నారు.. అయితే ఆమెకు పెళ్లికి ముందే అఫైర్ ఉందని ఇలా ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు అనే కోపంతో భర్తని చంపాలి అని భావించింది, అయితే ఆమె తీరుతో అందరూ షాక్ అయ్యారు. పోలీసులు కూడా ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోయారు, చూశారుగా ఇలాంటి పెళ్లాలు కూడా ఉంటున్నారు, పెళ్లి చేసుకునే ముందు కుటుంబాలతో పాటు అమ్మాయిల గురించి కూడా తెలుసుకోండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
ఈ క్రింద వీడియో చూడండి
The post పెళ్ళైన వారానికే.. భర్తకు విషం ఇచ్చిన భార్య ఎందుకో తెలిసి షాకైన పెళ్లి కొడుకు appeared first on Telugu Messenger.