మనిషి అన్నాకా ఏదో ఒక వీక్ నెస్ ఉంటుంది.వీక్ నెస్ లేనివాడు అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు.అయితే ఆ వీక్ నెస్ మామూలుది అయితే ఎలాంటి సమస్య ఉండదు కానీ ఆ వీక్ నెస్ మన జీవితాన్నే నాశనం చేస్తే ఎలా చెప్పండి.ఒక వ్యక్తి జీవితంలో ఇదే జరిగింది.అతనికి ఉన్న వీక్ నెస్ ఇప్పుడు ఆయన జీవితంలో చాలా బాధపడేలా చేసింది.అతని పేరు ఏంటో తెలియదు కానీ అతనికి జరిగిన నష్టము గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.మరి అతనికి జరిగిన నష్టం గురించి తెలుసుకుందామా.
అతనికి డబ్బులున్నాయి.రోజుకో దేశం తిరిగేవాడు.. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపాడు.ఏదేశం వెళ్లినా అక్కడ తన సుఖం కోసం ఒక మహిళతో పడకను పంచుకునేవాడు.మందు విందు పొందు ఈ మూడే తన జీవితాన్ని శాసించాలని భావించాడు.కేవలం అమ్మాయిలతో లైంగిక జీవితం గడిపేందుకే పెళ్లి కూడా చేసుకోలేదు. వండుకున్న వాడికి ఒక కూర.. అడుక్కునే వాడికి అరవై కూరల కాన్సెప్ట్‌ను ఫాలో అయ్యాడు.తన జీవితంలో ఎంతలేదన్న కొన్ని వేళ మంది మహిళలతో పడక పంచుకుని ఉంటాడు. ఇది తనే స్వయంగా చెప్పాడు.శృంగారంలో ఎంతటి రసికుడైనా ఏదో ఒక సమయంలో దానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే. ఇదే జరిగింది ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయంలో కూడా. యుక్త వయస్సులో అమ్మాయిలతో తెగ ఎంజాయ్ చేశాడు. ఇక ఇప్పుడు ఆయన వయస్సు 61 ఏళ్లు. ఈ వయసులో అమ్మాయిలతో ఎంజాయ్ చేసే సత్తా తనకున్నా… అమ్మాయిలు ఈ ముసలి బ్యాచిలర్‌తో గడిపేందుకు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం ఈ వృద్ధ బ్రహ్మచారి ఆరోగ్యం క్షీణిస్తోంది.
ఈ 61 ఏళ్లలో డబ్బు సంపాదన కాకుండా ఏమి సాధించాడో అని ఒక్కసారి వెనక్కి చూస్తే ఆయన బాగోతమంతా అమ్మాయిలతోనే ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది. పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు. ఇప్పుడు తనకు ఒక కుటుంబం ఉంటే బాగుండును కదా అని పరితపిస్తున్నాడు.తను అంతమంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడు కదా.. పొరపాటున తన ద్వారా ఏ అమ్మాయి అయినా గర్భం దాల్చి కొడుకో కూతురునో కని ఉంటుందేమో అన్న ఆశ అతనిలో మెదిలింది. ఈ వయస్సులో తన ఆస్తిని చూసుకునేందుకు వారసుల కోసం వేట మొదలు పెట్టాడు .ఇందులో భాగంగానే ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకునేందుకు సిద్ధపడ్డాడు.ఆన్‌లైన్ ద్వారా తన పరిస్థితిని వివరించాడు.ఆసక్తిగల డిటెక్టివ్ ఈ దేశాల్లో పర్యటించి తాను ఇచ్చే అమ్మాయిల జాబితా తీసుకుని వెళ్లి వారికి తన ద్వారా ఎవరైనా పిల్లలు కలిగారో లేదో కనుక్కుని తనకు సమాచారం ఇవ్వాలి.
ఇందుకు 5వేల పౌండ్లు జీతంగా చెల్లించనున్నట్లు ప్రకటనలో తెలిపాడు.అప్పట్లో తనకు కుటుంబం అంటే కుటుంబ విలువలంటే ఏమిటో తెలియలేదని.ఇప్పుడు తనకు ఓ కుటుంబం ఉంటే బాగుంటుందనిపిస్తోందన్నాడు.ఒకవేళ నా అన్న వాళ్లు లేకుంటే ఆ బాధ జీవితాంతం తన గుండెల్లోనే ఉండిపోతుందని అందుకే ఎక్కడున్నా సరే తన వారసుడిని వెతికి పట్టుకుంటానేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పాడు ఈ 61 ఏళ్ల వృద్ధుడు.విన్నారుగా ఈ నవయుగ మన్మధుడి గురించి.మరి ఇతని గురించి మీరేమనుకుంటున్నారు.అతను వయసులో ఉన్నప్పుడు చేసిన ఎంజాయ్ గురించి అలాగే ఇప్పుడు ఆయన బాధపడుతున్న విషయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.