ప్రపంచంలో ఎటువంటి కొత్త విషయాలు తెలియాలి అన్నా మీడియా మాధ్యమం ద్వారానే తెలుస్తాయి. అందులో ముఖ్యమైంది మీడియా రిపోర్టింగ్ అనే చెప్పాలి.. అందుకే మీడియాలో చాలా మంది ప్రొఫెషనల్స్ కి బయట ఎంతో విలువ గుర్తింపు ఉంటుంది.. ఇక వీరు లైవ్ రిపోర్టింగ్ ఇచ్చిన సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తలు లైవ్ కి తీసుకోవాలి, అయితే ఇలాంటి లైవ్ రికార్డింగ్ లో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. లైవ్ రికార్డింగ్ లో కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్దితులు వస్తాయి. ఇప్పుడు చెప్పుకునే కొన్ని మీడియా రిపోర్టింగ్ సమయంలో జరిగిన ఇన్సిడెంట్స్ మీకు నవ్వు తెప్పిస్తాయి.. మీడియాలో రిపోర్టర్స్ ఎప్పుడూ మేజర్ రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో వారు కొన్నికొన్ని సార్లు తప్పులు చేస్తూ ఉంటారు.
ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్లో యాంకర్ చేసిన తప్పు ఈ అమ్మాయికి పెద్ద మైనస్ అయింది.. ఇప్పటికీ దీని గురించి అందరూ చర్చించుకుంటారు. ఓ యాంకర్ షోని హోస్ట్ చేస్తున్న సమయంలో ఆమె ఎపీరియన్స్ కూడా చూసుకోవాలి ఆ సమయంలో గట్టిగా నవ్వింది. ఇక వెంటనే ఆమె ముందు పన్ను లైవ్ లో ఊడిపోయింది. ఆమె పన్ను ఊడిపోయింది అనేది లైవ్ లో టెలికాస్ట్ అయింది. ఆమె నవ్వు పన్నులేకుండా కనిపించింది. దీంతో ఆమె పేరు మొత్తం వైరల్ అయింది, ఈ షోకూడా పాపులర్ అయింది. తర్వాత ఆమె లైవ్ షోలు చేయడం మానేసింది.
ఇక ఓ రిపోర్టర్ అత్యుత్సాహం చూపిద్దామని అనుకున్నాడు.. అందుకే అనువుగా ఓ స్నో సెంటర్ కు వెళ్లాడు.. అక్కడ లైవ్ లో స్లైడర్లను చూపించాలి అని అనుకున్నాడు.. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ఇద్దరు స్లైడర్లను చూసుకోలేదు. ఇక వారిలో ఒకరు అతనిపై నేరుగా పడ్డాడు, ఇద్దరూ కిందపడటంతో అది అంతా లైవ్ రికార్డ్ అయింది, చివరకు రిపోర్టర్ కింద పడిపోవడం కూడా షోకు హైలెట్ గా నిలిచింది.
ఒక లైవ్ డ్యాన్స్ షోలో కింద పడిపోయిన జడ్జ్, అసలు ఈమె డ్యాన్స్ షోకు జడ్జ్ గా వచ్చింది. ఈ సమయంలో అక్కడ ఓ అమ్మాయి పోల్ డ్యాన్స్ చేసింది. అందరూ కూడా ఆమె ని పొగిడారు కాని జడ్జ్ గా వచ్చిన మరియా మాత్రం తాను డ్యాన్స్ చేస్తాను అని పోల్ డ్యాన్స్ చేసింది. కొత్త ఫీట్లు చేయడంతో ఆమె కిందపడిపోయింది.. అలాగే ఆమెకు పెద్ద దెబ్బలు కూడా తగిలాయి ఇది కూడా లైవ్ లో రికార్డు అయింది.
ఇక బ్యాగ్రౌండ్ గ్రాఫిక్స్ తో చూపించే రిపోర్టింగులు కూడా ఉంటాయి.. వీటిని చూసిన సమయంలో కొత్త కొత్త గ్రాఫులు చూపిస్తూ ఉంటారు. అలాగే వాతావరణం గురించి చూపిస్తూ ఉంటారు. ఈ సమయంలో తన వెనుక ఉన్న గ్రాఫ్ సరిగ్గా కనిపించడం లేదు అని అనుకున్న ఓ రిపోర్టర్, ఓ బ్యాక్ స్టెప్ వేసింది.. అంతే ఆమె లైవ్ లోనే కింద పడిపోయింది. ఇదంతా లైవ్ రికార్డు అయింది. మరి చూశారుగా ఇలాంటి పరిస్దితులు కూడా వస్తూ ఉంటాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను సిల్లీగా కామెంట్ల రూపంలో తెలియచేయండి.