మన ప్రపంచంలో ఉన్న దేశాల్లో అనేక జైళ్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. ముఖ్యంగా జైళ్లు ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో ఉండేవి కూడా ఉంటాయి. మరికొన్ని చాలా దారుణమైన పద్దతులు అవలంభించే జైల్లు ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఓ జైలు గురించి తెలుసుకోవాలి. నార్త్ కొరియా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ దేశంలో పద్దతులు కూడా అలాగే ఉంటాయి, అంతేకాదు ఇక్కడ జైళ్లో కూడా అనేక రకాల పద్దతులు నియమాలు కఠిన శిక్షలు ఉంటాయి. ఓసారి ఇక్కడ ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసుకుంటే ఇక్కడ జైలు చూడటానికి కూడా భయపడతారు.
నార్త్ కొరియాలో లీవ్ హైజీన్ అనే వ్యక్తి ఇక్కడ దేశంలో ఉన్న సెంట్రల్ జైలు గురించి షాకింగ్ నిజాలు చెప్పాడు, తన వయసు 17 సంవత్సరాల ఉన్న సమయంలో ఈ జైలులో గార్డుగా చేరాను అని, అప్పటి నుంచి అనేక మందిని ఇక్కడ చూశాను అని చెబుతున్నారు. ఈజైలులో ఏడు సంవత్సరాలు పనిచేశాను అని చెబుతున్నాడు లీవ్, అయితే ఇక్కడ మహిళా ఖైదీలు ఎక్కువ మంది ఉంటారు అని, వారిని శారీరకంగా బట్టలు విప్పి కొడతారని, ఒకవేళ వారు మాట వినకపోతే రెండు మూడు రోజుల వరకూ తిండి కూడా పెట్టరు, ఇక మూత్రం పోసి అదే తాగమని కూడా కొందరు అధికారులు ఇక్కడ నీరు ఇవ్వకుండా ఏడిపిస్తారట.
ఇక్కడ ఖైదీలను మనుషులుగా చూడకండి అని, కేవలం జంతువులుగా చూడాలి అని పైన ఉన్నతాధికారులు చెబుతారని చెప్పాడు లీవ్..కింద జైలు పైన అధికారుల ఆఫీసులు ఉంటాయి..ఖైదీలను వర్షంలో వదిలేసి తడుపుతారు.. వారికి జబ్బు వచ్చినా పట్టించుకోరు. రోజు వందల మంది ఖైదీలు ఇక్కడ చనిపోతున్నారు అని, రాత్రిమిగిలిన భోజనం ఉదయం పెడతారు అని చెబుతున్నాడు లీవ్.. ఇక్కడ కొందరు గాడ్స్ మహిళా ఖైదీలని తప్పుడు పనులకు వాడుకుంటారట. ఇక్కడ ఆకలి చావులు చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పాడు లీవ్, అలాగే ఇక్కడ జైలు నుంచి తప్పించుకోవడానికి ఓ ఇద్దరు ఖైదీలు ప్రయత్నించారని. ఈ సమయంలో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, వారి కుటుంబం నుంచి ఆరుగురిని చంపేశారట పోలీసులు, అలాగే తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఖైదీలను ఇద్దరిని ఉరితీశారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఉదయం ఖైదీలను నాలుగు గంటలకు నిద్ర లేపుతారు.. రోజుకి 16 గంటల పాటు వీరిచేత పని చేయిస్తారు అని చెబుతున్నాడు లీవ్ , ఇక వారానికి ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా వారిచేత గొడ్డు చాకిరీ చేయిస్తారు, ఇక తిండి లేక పాములు కూడా తిని బ్రతుకుతారు ఇక్కడ ఖైదీలు. దాదాపు రెండు లక్షల మంది ఖైదీలు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు, 30 వేల మంది సైన్యం వీరికి ఇక్కడ కాపలా కాస్తారు. దీనిని లేబర్ క్యాంపు అంటారు, ఇక జైలులోకి వెళ్లాలి అంటే ఇక్కడ కెమెరాలు ఫోన్లు అనుమతించరు, తాజాగా ఇక్కడ శాటిలైట్ ద్వారా జైలుకి సంబంధించిన పలు ఫోటోలు తీయడం జరిగింది. అందుకే ఇక్కడ జరుగుతున్న దారుణాలు బయటపడ్డాయి.ఇంత దారుణమైన శిక్షలు అక్కడ ఖైదీలకు వేస్తారు అందుకే వారు తప్పులు చేయడానికి అంత సాహసం చేయరు అని చెబుతున్నారు అధికారులు. మరి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాలను ఈ శిక్షల పై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి.