ప్రేమ అన్నాకా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.గొడవలు వస్తేనే ప్రేమ ఎంత ఉందొ తెలుస్తుంది.అలా అని పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోమని కాదు.చిలిపి గొడవలు ఉంటేనే మజా ఉంటుంది.అయితే ప్రేమికుల మధ్య ప్రేమ తప్ప మరేమి ఉండకూడదు.ముఖ్యంగా అనుమానాలు ఉండకూడదు.అయితే ఒక ప్రేమికుడు మాత్రం ప్రేయసి మీద చిన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు.మరి అతని సమస్య ఏమిటో దానికి సొల్యుషన్ ఏమిటో చూద్దామా.
ప్రశ్న : నా గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు ప్రాణం. తనతో ఒక్క క్షణం మాట్లాడకపోయినా నేను ఉండలేను. తను కూడా నన్ను అంతలా ప్రేమిస్తున్నాని చెబుతూ ఉంటుంది. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అయితే కొన్ని రోజుల క్రితం తనతో పాటు కాలేజీలో చదువుకున్న ఒక అబ్బాయిని పరిచయం చేసింది. అతను నాకంటే అందంగా ఉన్నాడు. నాకంటే హైట్ ఉన్నాడు. నా గర్ల్ ఫ్రెండ్ అతనితో ఎక్కువగా చనువుగా ఉంటుంది.నేను పక్కన ఉన్నా కూడా తనతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది. నాకన్నా ఎక్కువగా అతనితో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఒక రోజు తను బెడ్రూమ్ లో కూర్చొని అతనితో వీడియో చాటింగ్ చేస్తుండగా నేను చూశాను.అతనితో చాట్ చేసే సమయంలో నా గర్ల్ ఫ్రెండ్ కేవలం పెటీకోట్ మాత్రమే వేసుకుంది. నాకెందుకో అనుమానం వస్తుంది. తను భవిష్యత్తులో అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందేమోనని నాకు భయం వేస్తూ ఉంది.నేను అప్పుడు తనను ఏమీ అనలేదు. తను మాత్రం అదేమీ పెద్ద తప్పుకాదు అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. తనను నేను ప్రశ్నించలేను. ఒక వేళ ప్రశ్నిస్తే తను నాకు దూరం అవుతుందేమోనని భయం. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. దయజేసి సలహా ఇవ్వగలరని అతని బాధను చెప్పుకొచ్చాడు.మరి అతని సమస్యకు పరిష్కారం ఏమిటో చూద్దామా.
సమాధానం : మీకు మీ గర్ల్ ఫ్రెండ్ పై ఎంతో ప్రేమ ఉందని తెలుస్తుంది. అమ్మాయిలకు అబ్బాయిలతో పరిచయాలు ఉండడం తప్పు కాదు. కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతూ మరొకరితో మరీ సన్నిహితంగా గడపడం అనేది మంచి విషయం కాదు.మీరు ఈ విషయాన్ని ధైర్యంగా ఆమెతో చెప్పండి. ఆమె మరీ పర్సనల్ గా అతనితో చాట్ చేయడం వల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బందులుపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఆమెను హెచ్చరించడం మంచిది.పెళ్లి చేసుకున్నాక ఇలాంటి సమస్యలు, అనుమానాలు తలెత్తితే అనవసరంగా మీ జీవితం నవ్వుల పాలు అవుతుందని గుర్తించుకోండి. ఒకవేళ ఆమెకు నీకంటే అతనిపై ఎక్కువగా ఇష్టం ఉంటే మీరు ఇప్పుడే సైడ్ అవ్వడం మంచిది. అనవసరంగా భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.మీలో కూడా ఎవరికైనా ఇలాంటి సమస్యే ఉంటె వెంటనే మీ లవర్ తో మాట్లాడి పరిష్కరించుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రేయసి మీద అతనికి ఉన్న సందేహము గురించి అలాగే అతనికి మేము ఇచ్చిన సొల్యూషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.