Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

ప్రేమికురాలికి పరువు శిక్ష గుండు గీసి, నాలుకపై వాత ఆ త_ర్వాత ఏం చేశారో తెలిస్తే షాక్

$
0
0

ప్రేమిస్తే ప‌రువు కోసం హ‌త్య‌లు చేస్తున్నారు అలాగే వారి ప్రేమ‌ను నిల‌బెట్టుకోలేక వారు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. ఇలాంటివారు చాలా మంది ఉంటున్నారు. ఇక ఎన్ని దారుణాలు జ‌రిగినా పోలీసులు సొసైటి ఎంత చెప్పినా ఇలాంటి వారిలో మార్పు మాత్రం రావ‌డం లేదు.యువతులపై దారుణాలు ఆగడంలేదు. తాజాగా ఓ యువతి తన కులం కాని ఓ యువకుడిని ఇష్టపడిందని ఆమెని ఎంతో దారుణంగా హింసించారు, పెళ్లి చేసుకునేందుకు అంగీకరించిందని ఆ ఊరి గ్రామ పెద్దలు ఆమెకు పరువు శిక్ష విధించారు. సైన్స్ టెక్నాల‌జీ స‌మాజం ఇంత అభివృద్ది చెందుతున్నా కులాల హ‌త్య‌లు ప‌రువు శిక్ష‌లు, ఇంకా గ్రామాల్లో అమలు చేస్తున్నారు తాజాగా ఆమెకు ఇలాంటి శిక్ష విధించారు.

victim

అతి దారుణంగా ఆమె నాలుకపై బంగారు కడ్డీతో వాతలు పెట్టి, గుండు కొట్టించాలని తీర్మానించారు.. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బీంరెడ్డి గూడెం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి రేచపల్లికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. ఐతే వీరిరువురి కులాలు వేరు. దీనితో ఆరు నెలల క్రితం యువతి తల్లిదండ్రులు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ గొడవల మధ్య తమ కుమార్తె తమ ఊరిలో ఎందుకు అనుకుని, ఆమెను తమ దూరపు బంధువుల ఇంట్లో వుంచారు.

Image result for lovers images

ఐతే గొడవ కాస్త సద్దుమణిగిందని యువతిని సొంత ఊరికి తీసుకుని వస్తుండగా గ్రామ పెద్దలు అడ్డుకున్నారు. కులం కాని కులానికి చెందిన యువకుడిని ప్రేమించిన మీ కుమార్తె గ్రామంలో వుండటానికి వీల్లేదనీ, ఒకవేళ గ్రామంలో వుండాలంటే తాము విధించే శిక్షను అనుభవించాలని షరతు పెట్టారు. ఇందులో భాగంగా.. రూ.26 వేల జరిమానాతో పాటు ఆమె నాలుకపై బంగారు తీగతో వాత పెట్టాలని, మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా గుండు గీసి గ్రామంలో ఊరేగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అదే రోజు సాయంత్రం తీర్పును అమలు చేయాలని సూచించగా సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి యువతిని రక్షించారు. గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలాంటి దారుణ‌మైన నిర్ణ‌యాలు క‌ట్టుబాట్లు అమ‌లుచేయాలి అని అనుకుంటే వెంట‌నే, ఇలాంటి విష‌యాలు పోలీసుల‌కు తెలియ‌చేయండి, అమానుష క‌ట్టుబాట్లు వింటూ వారినే పాటించాలి అని చెప్పే సంస్కృతి ఇప్పుడు అంత‌రిస్తోంది అయినా గ్రామాల్లో ఇలాంటి నీచ‌పు క‌ట్టుబాట్లు అంతం చేయ‌డానికి, మీ వంతు కృషి కూడా చేయండి. మ‌రి చూశారుగా ఆమెని చాక‌చ‌క్యంగా అక్క‌డ గ్రామ‌స్తులు కొంద‌రు కాపాడారు. దీని పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles