సమాజంలో రోజురోజుకు దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.హత్యలు ఆత్మహత్యలు అత్యాచారాలు..అడుగడుగునా ఈ ఘటనలే వెలుగుచూస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకు చంపుకుంటున్నారు.కొందరు అయితే చిన్న చిన్న పిల్లలలను హత్య చేస్తున్నారు.లాస్ట్ సోమవారం నాడు కలకలం లేపిన చిన్నారి అలేఖ్య హత్య ఘటనను పోలీసులు ఛేదించారు.మరి చంపింది ఎవరు ఎందుకు చంపారో చూద్దామా.
ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రాంతానికి చెందిన మీనాక్షి రైళ్లలో యాచకవృత్తి చేసుకుని జీవించేది. నాలుగేళ్ల కిందట ఆమెతో కృష్ణకు పరిచయం ఏర్పడడంతో వీరిరువురు పెళ్లి చేసుకుని దువ్వాడ సెక్టార్ –1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. అనంతరం వీరికి చిన్నారి అలేఖ్య పుట్టింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట దుర్గ అనే యువతిని కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వెదుళ్లనరవలో కాపురం పెట్టాడు. ఆమె వద్దే ఎక్కువగా ఉండే కృష్ణ ఎప్పుడైనా మొదటి భార్య మీనాక్షి వద్దకు వచ్చినా ఏదో ఒక విషయంపై గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు.భర్త రెండో పెళ్లి చేసుకుని దూరంగా ఉంటుండడంతో మీనాక్షి స్థానికంగా పనులు చేసుకుని, రైళ్లలో సమోసాలు అమ్ముకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తల్లి సహాయంగా ఉంటోంది.ఎప్పటిలాగే చిన్నారి అలేఖ్యను ఇంటి వద్ద విడిచిపెట్టి సమోసాలు అమ్ముకునేందుకు సోమవారం ఉదయం మీనాక్షి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురై భర్త కృష్ణకు విషయం తెలియజేసింది. అనంతరం ఇద్దరూ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సోమవారం రాత్రి దువ్వాడ పోలీసులకు మీనాక్షి ఫిర్యాదు చేసింది.
మంగళవారం ఉదయం కూడా పాప కోసం వెదుకుతుండగా కృష్ణ తోడల్లుడు రాజు ఇంటిని ఆనుకొని ఉన్న తుప్పల్లో అలేఖ్య మృతదేహం కనిపించింది.వెంటనే కృష్ణ దువ్వాడ పోలీసులకు సమాచారం అందించడంతో సౌత్ ఏసీపీ రంగరాజు, దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్, స్టీల్‌ప్లాంట్ సీఐ లక్ష్మి, గాజువాక సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పాప తండ్రి కృష్ణ, అతని రెండో భార్య దుర్గ, ఆమె బావ(కృష్ణ తోడల్లుడు)రాజులను వేర్వేరుగా పోలీసులు విచారించారు. సవతి తల్లే అలేఖ్యను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి అలేఖ్య పట్ల తండ్రి కృష్ణ చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేకే సవతి తల్లి ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. చిన్నారిని ఇంటి గోడకు బలంగా కొట్టి అంతమొందించినట్లు సవతి తల్లి దుర్గ విచారణలో తెలిపింది.విన్నారుగా చిన్న విషయానికి బంగారం లాంటి పాపను ఎలా చంపేసిందో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.