కాజీపేట మండలం మడికొండకు చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నాతి రవీందర్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన 1990 నుంచి 2000 సంవత్సరం వరకు సీపీఐలో పనిచేశారు. అనంతరం 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు.
కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు గతంలో సీపీఐలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రవీందర్ అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. కాగా, కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. రవీందర్ అకాల మృతి పట్ల ఎంపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన మరణం కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అని తెలిపా రు. స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, టీఆర్‌ఎస్ యువజన విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు రవీందర్ మృతికి సం తాపం తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఆపద సమయంలో అనేక మందికి సహకారం అందించాడని తెలిపారు.