మనం ఉదయం లేవగానే కాస్త బద్దకంగా ఉంటాం. దానికి కారణం మనం రాత్రి ఎక్కువ సేపు ఏదైనా పనిచేసినా, ఆ ముందు రోజు ఎక్కువ శరీరం కష్టం చేసినా, ఆ ఫీలింగ్ వస్తుంది. అలాగే బద్దకం కూడా చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. ఇక నిద్రలేమి వల్ల అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. అలాగే బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం అలాగే తిన్నా ఆహారం కూడా సరిగ్గా ప్రొటీన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా మన శరీరం ఇలాంటి పరిస్దితులకు కారణం అవుతుంది. ఇక కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోరు, వీరికి ఇప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కనిపించకపోయినా, తర్వాత వీరికి అనేక సమస్యలు వస్తాయి అందుకే ఎప్పుడూ సరైన ఫుడ్ తీసుకోవాలి.
ఇక ఉదయం లేవగానే కచ్చితంగా ఈ ఐదు పనులు మాత్రం కొందరు చేస్తారు వాటిని మానెయండి.. ఇప్పుడు చెప్పే కొన్ని అలవాట్లు ఉన్నా తప్పకుండా మీరు ఆ అలవాట్లను మానండి.
1.. రాత్రి పనిచేసి నిద్ర ఎక్కువగా చేస్తూ ఉంటారు..వారు బ్రేక్ ఫాస్ట్ చేయరు, ఆకలి తట్టుకోలేరు, కాని అందరూ తెలుసుకోవాల్సింది కచ్చితంగా ఉదయం హార్ట్ బ్రేక్ ఫాస్ట్ తినాలి. ఎందుకంటే రాత్రి మనం తిన్న ఆహారం మేజర్ కాలరీలని నైట్ వినియోగించుకుంటుంది. అందుకే ఈ సమయంలో కచ్చితంగా ఫుడ్ తినాలి. ఇలా బ్రేక్ ఫాస్ట్ ఉదయం తినకుండా ఉండే అలవాటు మీకు ఉంటే కచ్చితంగా మానెయ్యండి. ఓ రెండు ఫ్రూట్స్ అయినా తినే అలవాటును తప్పనిసరిగా చేసుకోవాలి.
2. ఈ నవీన యుగంలో అందరూ సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటున్నారు అందుకే వారికి మరింత స్మార్ట్ ఫోన్ అలవాటు అయిపోయింది. ముఖ్యంగా ఇలా ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి.. ఆరోగ్యంగా కూడా ఎంతో ఇబ్బంది, అయితే డాక్టర్లు చెప్పినా ఆ ఫోన్లు పక్కనే ఉంటున్నాయి. అందుకే రాత్రి పడుకునే ముందు ఎరోప్లైన్ మోడ్ లో పెట్టి రాత్రి పడుకోవాలి. ఉదయం కూడా మీ పనులు పూర్తి అయి ఆఫీసుకు వెళ్లే సమయంలో మాత్రమే ఇలా ఫోన్లు వాడాలి. అప్పటి వరకూ ఫోన్ వాడకుండా ఉంటే మీకు ఆరోగ్యం కూడా ఉంటుంది.
3.. డ్రింకింగ్ వాటర్ విత్ ఎమ్ టీ స్టమక్ ..ఇది చాలామంది చెబుతూ ఉంటారు, మనలో చాలా మంది రోజుకు ఐదు లీటర్ల నీరు తాగుతారు. కాని కొందరు మాత్రం రెండు నుంచి మూడు లీటర్ల నీరు మాత్రమే తాగుతారు. కాని ఇది మంచిది కాదు ఆరోగ్యంగా ఉండాలి అంటే కచ్చితంగా ఐదు లీటర్ల నీరు తాగాలి అని చెబుతున్నారు డాక్టర్లు.. ఉదయం పరగడుపున అందుకే ఓ లీటరు నీటిని తాగాలి, ఈ అలవాటు లేని వారు రోజుకు అరచెంబుడు నీటిని తాగడం అలవాటు చేసుకుంటే, ఉండేకొలది అలవాటు అవుతుంది. ఇలా మంచి నీరు తాగడం వల్ల కిడ్నీలు క్లీన్ అవుతాయి.
4.. డ్రింక్ కాఫీ.. ఇక ఉదయం చాలా మంది బెడ్ పై నుంచి లేవగానే ముందు టీ లేదా హాట్ కాఫీ తాగుతారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెబుతున్నారు డాక్టర్లు.. మరీ ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకుంటే కెఫెన్ శాతం పెరిగిపోతుంది. అలాగే బద్దకం పెరిగిపోతుంది. పరగడపున కాఫీ తీసుకోకుండా మూడు గంటల తర్వాత కాఫీ తాగాలి అని చెబుతున్నారు వైద్యులు. మరి ఇది కూడా ఓసారి ఆలోచించండి.
5.. ఉదయం లేవగానే చాలా మందికి ఉండే అలవాటు బెడ్ ని ఎలా ఉందో అలాగే ఉంచుతారు… నిద్రలేవగానే మీ బెడ్ పూర్తిగా సర్దుకోవాలి. ఎందుకంటే రాత్రినుంచి ఉదయానికి మీ బెడ్ పై ఓ మిలియన్ డస్ట్ ఉంటుంది అని చెబుతున్నారు డాక్టర్లు.. మరి చూశారుగా ఇలాంటి అలవాట్లు ఉంటే కచ్చితంగా వాటిని మీ నుంచి దూరం చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.