భూకంపాలు అంటే మన రాష్ట్రానికి అంత పరిచయం లేనివి అని చెప్పాలి. సదరన్ స్టేట్స్ లో చాలా తక్కువగా ఉంటాయి. నార్త్ సైడ్ భూప్రకంపనలు అప్పుడప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా విజయవాడ గుంటూరు ప్రకాశం ప్రాంతంలో అప్పుడప్పుడు భూమి కంపించినా అది పెద్ద ఎత్తున నష్టాన్ని ఏమీ మిగిల్చిన దాఖలాలులేవు. ఇక తాజాగా ఇప్పుడు భూకంపం భూ భ్రమణలు ప్రజలను కాస్త కలవరపాటుకి గురిచేస్తున్నాయి.
కృష్ణాజిల్లా కొండపల్లిలో ఆదివారం భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారని, రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైనట్లు తెలిసింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీ కాంతం స్పందిస్తూ.. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ప్రకటించారు.
ఇటీవల దేశవ్యాప్తంగా భూకంపం, సునామీలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్‌లోని పాలూ నగరాన్ని భారీ భూకంపం, సునామీలు అంతలాకుతలం చేశాయి. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో భూకంపం మాట వినగానే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లిలో భూకంపం ఏర్పడిందనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. అయితే, భూకంపం వచ్చిందా, లేదా ఎవరైనా అలా భావించి ప్రచారం చేస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. భూకంపం వార్తను అధికారులు కూడా ఇంకా ధృవీకరించలేదు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
మొత్తానికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని, తిత్లి తుఫాను ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఇలా భూకంపంగా చూపించింది అని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మొత్తానికి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేదానిపై అక్కడ ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. మరి మీరు ఆ ప్రాంతం వారు అయితే అక్కడ జరిగిన దానిపై కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. భయాందోళనలో ఉన్నవారికి సరైన విషయం చెప్పండి.