Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

అక్టోబర్ 23న బర్త్ డే.. అభిమానులకు పండుగ లాంటి వార్త చెప్పనున్న ప్రభాస్..ఏంటో తెలిస్తే షాక్

$
0
0

బాహుబలి స్టార్ ప్రభాస్ మరో వారం రోజుల్లో 38వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈసారి యంగ్ రెబల్ స్టార్ నుండి సర్‌ప్రైజింగ్ న్యూస్ వింటామని అభిమానులు ఆశ పడుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 23న ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ టీజర్, ట్రైలర్ లాంటివి అభిమానులు ఆశించడం సర్వసాధారణమే. అయితే ఫ్యాన్స్ ఈ సారి అంతకు మించిన సర్‌ప్రైజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.అందుకే పుట్టినరోజునాడు ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నాడు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి బాహుబలి తరువాత మరో చిత్రం రాలేదు. బాహుబలి 2 తరువాత భారీ గ్యాప్ ఏర్పడింది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో సాహో చిత్రం తెరకెక్కుతుండడంతో ఆలస్యం జరుగుతోంది. దీనితో ప్రభాస్ అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు.సాహో చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే.రాధాకృష్ణ దర్శత్వం వహిస్తున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 23 న ప్రభాస్ జన్మదిన వేడుక జరగనుంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ధమాకా అందించబబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాహో చిత్ర టీజర్ ని ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే సమయంలో రాధాకృష్ణ దర్శత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించి కూడా సర్ ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.అతని పెళ్లి విషయంలో అనేక రూమర్స్ వచ్చాయి.అయితే అందులో ఎలాంటి నిజాలు లేవు.ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గత కొన్ని రోజులుగా ఈ బాహుబలికి తగిన జోడీని వెతికే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెళ్లి గురించిన రూమర్స్‌కు తెరదించాలని వారు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి వార్త అతి త్వరలోనే ఆయన పెదనాన్న కృష్ణం రాజు ద్వారా బ్రేక్ చేయబోతున్నారని, అది కూడా ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.కృష్ణంరాజూ వాళ్లకు పాత చుట్టాలు అయినా ఒక ఫామిలీ అమ్మాయిని చూశారని అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి నచ్చడం జరిగిపోయిందని తెలుస్తుంది.అమ్మాయి అమెరికాలో mba చేసినట్టు సమాచారం.ప్రభాస్ పుట్టినరోజున ఈ విషయం అధికారంగా ప్రకటించాలని కృష్ణం రాజు అనుకుంటున్నాడట.దీంతో అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఖాయం అని తెలుస్తుంది.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles