తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది అనే చెప్పాలి… ఇక ఈ సమయంలో పార్టీ కేడర్ ని సమాయత్తం చేస్తున్నాయి అన్ని పార్టీలు.. ముఖ్యంగా తెలంగాణలో రెండు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఇక ఎన్నికల సందర్బంగా పార్టీల ప్రచారాలతో ప్రతీ చోట ఎన్నికల సందడి మొదలైంది…ఓ పక్క కేసీఆర్ మరో పక్క కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రచారాలతో తెలంగాణ అంతా ఎన్నికల ప్రచార కళ వచ్చింది.ఇక ఈ సమయంలో తెరాస పార్టీకి ఓ షాక్ తగిలింది అనే చెప్పాలి. పార్టీకి చెందిన ఓ కీలక నేత మరణం ఆ పార్టీకి తీరని విషాదం నింపింది.
కీసర మండలంలో ఓ విషాదం జరిగింది. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మండల మాజీ వైస్-ఎంపీపీ బి.భరత్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మార్నింగ్ వాక్ చేయడానికి బైక్‌పై వెళ్తున్న భరత్‌రెడ్డిని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఈ ప్రమాదం గమనించిన చుట్టుపక్కలవారు ఆయనను జినియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాద దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కాగా, భరత్‌రెడ్డి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ నాయకుడి హఠాన్మరణం కీసర మండలంలో కలకలం రేపింది అని చెప్పాలి.ఆయన రోజూలాగా ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో బైక్ పై ప్రయాణం చేస్తున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వచ్చి డీకొట్టడం ఇలా వెంటనే ఆయన కిందపడిపోవడం బైక్ ని ఈడ్డుకూంటూ లారీ తీసుకువెళ్లిన దృశ్యాలు సీసీ టీవీలో కనిపిస్తున్నాయి.. మొత్తానికి ఈ దారుణమైన ఘటనతో అందరూ షాక్ అయ్యారు . స్ధానికంగా ఆయన ఎంతో కీలకంగా టీఆర్ఎస్ లో ఉన్నారు అని, ఆయన ఇక్కడ కేడర్ ని పార్టీ తరపున ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకువెళుతున్నారు అని ఇలా లారీ రూపంలో మృత్యువు వచ్చి ఆయన ప్రాణాలు తీసుకువెళ్లడం చాలా బాధాకరమని చెబుతున్నారు ఆయన సన్నిహితులు.