ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి అని అందరికి తెలుసు, ఇక ఆయన సినీ ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా తనకు తానుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయ్యారు ఉపాసన.. ఆమెకు కూడా సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఎప్పుడూ సినిమా విషయాలు సామాజిక విషయాలతో పోస్టులు పెడుతూ ఆమె చర్చల్లోకి వస్తారు. ఇక ఎప్పుడూ ప్రతీ విషయంలో అప్ డేట్ గా ఉంటుంది ఉపాసన.సరదాగా చరణ్ గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేస్తుంది ఆమె, ఇకఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా ఆమె ఉంటుంది, ఇక ఆమె వ్యాపారంగం కుటుంబం నుంచి వచ్చింది.
అపోలో హాస్పటల్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కుమార్తె శోభనా కామినేని పెద్ద కుమార్తె ఉపాసన, ఆమెకు ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు అనుష్పలా, ఆమె అచ్చం ఉపాసనలా ఉంటారు. ఇక అనుష్పలా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేసింది విదేశాల్లో. ఇక హైదరాబాద్ వచ్చి ఆమె కుటుంబం చేస్తున్న వ్యాపారం చూసుకుంటోంది. అపోలో గ్రూప్ లో ఆమె అపోలో ఫార్మసీ వ్యవహారాలు చూసుకుంటుంది . ఆమె ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. హైదరాబాద్ లో జరిగే మోడలింగ్ పోటీల్లో ఎక్కువగా ఆమె పాల్గొంటుంది, ఆ సమయంలో మోడల్ దుస్తుల్లో జిగేల్ మంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పటల్స్ కు మెడికల్ షాపులకు మందులు సరఫరా చేసే బాధ్యత ఆమె చూసుకుంటున్నారు… ఇక కొద్దిరోజులుగా రామ్ చరణ్ ఫ్రెండ్ అయిన తెలుగుహీరో శర్వానంద్ కు, అనుష్పలాని ఇచ్చి పెళ్లి చేయనున్నారు అని వార్తలు వచ్చాయి.. అయితే దీనిపై ఎటువంటి ప్రకటన ఇరుకుటుంబాల నుంచి రాలేదు.. దీంతో ఇదంతా పుకార్లు అని తేలిపోయింది. ఇక ఆమె కుటుంబం నుంచి సామాజిక సేవలోఈమె కూడా ముందు ఉంటుంది.. తాజాగా దసరాకి బాలికా నిలయంలో బావ మెగా పవర్ స్టార్ చరణ్ ,అక్క ఉపాసనతో కలిసి బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు.