ఈనాడు సంస్దలు అంటే పెద్ద పేరు అని చెప్పాలి.. ఎప్పటి నుంచో ఈ సంస్ద వేల మందిని తమ కుటుంబంగా చూస్తోంది. మీడియాలో ఈనాడు కంపెనీలో ఉద్యోగం అంటే అది ప్రభుత్వ ఉద్యోగం అంటారు, అలాగే ఉద్యోగికి భరోసా కలిగిన ఉద్యోగంగా చెబుతారు. ఈసంస్దలో ఉద్యోగులు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ కంపెనీలో ఉద్యోగం చేసేవారు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. మీడియాలో ఓ కొత్త ఒరవడిని తీసుకువచ్చింది ఈనాడు. పత్రికా చానల్ వీక్లీ పుస్తకాలు సర్కిలేషన్లో కొత్త పద్దతులు అడ్వర్టైజింగ్ ఇలా అనేక విభాగాలను కొత్తగా తీసుకువచ్చింది. కలర్ ఫుల్ పత్రికగా తెలుగులో సరికొత్త వార్తలను అందించింది.
ఇక ఈనాడు సంస్దలో ఉద్యోగులు వేలసంఖ్యలో ఉన్నారు, తాజాగా ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఉద్యోగులకు సెక్యూరిటీ లేకుండా పోయింది. అవును వారి ఉద్యోగానికి సెక్యూరిటీ లేకుండా పోయింది అని వారు బాధపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వీరిని ఉద్యోగంలో నుంచి తీసేసింది ఈనాడు సంస్ధ…సుమారు 400 మంది సెక్యూరిటీ గార్డులను ఉద్యోగం నుంచి తొలిగించారు అని తెలుస్తోంది ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తు ఉన్నవారిక వేలల్లో జీతాలు ఇవ్వాలి అని అందుకే వారికి కాకుండాఓ ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చూసారు అట.
ఇక బీహార్ యూపీ నుంచి నెలకు తక్కువ జీతానికి పనిచేసే వారిని సెలక్ట్ చేశారు. వారిని ఉద్యోగాల్లో తీసుకున్నారట. ఇక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్నవారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారట. ఇలాంటి దారుణమైన పరిస్దితి తమకు వస్తుంది అని ఏనాడు అనుకోలేదు. కాని ఇలాంటి పరిస్దితి వచ్చింది అని కన్నీరు పెట్టుకుంటున్నారు.. రోజూ సమాజంలో జరిగే అనేక వార్తలను ఇచ్చే ఈనాడు సంస్ద మా పై కూడా వార్తలు ఇస్తుందా అని అంటున్నారు.. మా సంక్షేమం పట్టించుకోలేదు అని ఉద్యోగులుగా తమను ఇప్పుడు రోడ్డున పడేశారు అని వారు బాధపడుతున్నారు