Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

అమ్మాయిలకు అవి పెరగడానికి ఇంజక్షన్లు వాడుతూ ఎంత దారుణం చేస్తున్నారో తెలిస్తే షాక్

$
0
0

కొంద‌రు అమ్మాయిలపై ఇటీవ‌ల వ్య‌భిచార వృత్తిలోకివారిని దింపాలి అని చూస్తున్నారు. కొంద‌రు ముఠాలుగా ఏర్ప‌డి, దారుణ‌మైన లైంగిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.. వారి శ‌రీర అవ‌య‌వాలు పెరిగేలా మ‌త్తు ఇంజ‌క్ష‌న్లు హార్మ‌న్ల ఇంజ‌క్ష‌న్లు ఇస్తున్నారు.. ఇలా యాద‌గిరి గుట్ట ద‌గ్గ‌ర కొంద‌రు మైన‌ర్ బాలిక‌ల‌కు ఇంజ‌క్ష‌న్లు ఇచ్చి, వారి శ‌రీరాలతో వ్యాపారం చేసేవారిని పోలీసులు ప‌ట్టుకున్నారు.

ఇలాంటి వారిపై ఉమ్మడి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిఘా వ్యవస్థ తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. యాదాద్రిలో బలవంతంగా వ్యభిచారం చేసే దారుణం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మాంసం పెరగటానికి బాయిలర్ కోళ్లకు ఇంజక్షన్లు ఇస్తున్నట్లుగా.. చిన్నారుల శరీరాలు పెరిగేలా హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వ్యభిచార కూపంలో దించటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇంత దారుణం జరుగుతుంటే.. నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించింది. హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్న వారిపై ఐసీపీ సెక్షన్ 120(బి) కింద కేసులు నమోదు చేశారా? అని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం.. అధికారులకు తెలీకుండా ఇది జరిగి ఉంటుందా? అని ప్రశ్నించింది.అధికారులకు.. నిఘా వర్గాలకు తెలీకుండా జరిగి ఉంటుందని తాము భావించటం లేదని.. నిర్వాహకులతో సంబంధిత అధికారులు లాలూచీ పడ్డట్లు కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఈ కేసులకు సంబంధించిన నిందితులకు కింది కోర్టులు బెయిల్ ఎలా ఇస్తాయన్న ప్రశ్నను సందించింది. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసు శాఖ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఏజీ జె. రామచందర్ రావు కోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే.. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

సీరియస్ గా తీసుకోవాల్సిన కేసుల్లో బాధిత చిన్నారులకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. చిన్నారుల రక్షణ కోసం చర్యలు తీసుకోవటంతో పాటు.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలంది. పోలీసు శాఖ.. నిఘా విభాగం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన తీరు నేపథ్యంలో.. ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డే వారికి బెయిల్ రాకుండా చెయ్యాలి అని, బాల‌ల హ‌క్కులు హ‌రించేప‌ని అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇంకా ఎదుగుద‌ల లేని అమ్మాయిల‌కు ఇలాంటి ఇంజ‌క్ష‌న్లు ఇచ్చి వారి శ‌రీరాల‌తో వ్యాపారం చేస్తున్నారు అని విమ‌ర్శ‌లు ఇటీవ‌ల పెరిగిపోయాయి. మ‌రి చూశారుగా ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్న ముఠాలు కూడా ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles