దేశంలో సీబీఐ పై వస్తున్న అవినీతి మరకలు ఇప్పుడు బీజేపీకి ఓ పెద్ద గుదిబండలా మారాయి.. దేశంలో ఇలాంటి ఆరోపణలు అత్యున్నత విచారణ సంస్ద పై రావడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ సమయంలో ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రంగా బీజేపీ పై విమర్శలు పెరిగిపోయాయి.. అధికారిని మార్చి కొత్త వ్యక్తిని పెట్టినా సరే అక్కడ అవినీతి మరక సీబీఐపై అలాగే ఉంది.. ఓ వ్యక్తిని తప్పించి మరో వ్యక్తిని అక్కడ నియమించిన మోదీకి ఆయన చర్యలపై కూడా విసుగు వచ్చింది. ఇక ప్రత్యామ్నాయం లేక కొత్త డైరక్టరును సీబీఐలో నియమించారు.
సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి… అర్ధరాత్రి వేళ సీబీఐ చీఫ్ తొలగింపు.. ఆకస్మిక బదిలీలు.. తమవారిని కాపాడుకోవడానికి చేపట్టిన చర్యేనని ఆరోపిస్తున్నాయి. మోదీ సర్కారు తీరును నిరసిస్తూ భారత్‌బంద్ నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. ఈ బంద్ శుక్రవారం ఉండే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంధి.. సీబీఐ విషయంలో మోదీ సర్కారు నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలనిచ్చినట్లుగా కనిపిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అస్థానా దొరికిపోయిన విషయంపై దృష్టి కేంద్రీకరించకుండా, అలోక్‌వర్మపై కిందిస్థాయి అధికారి చేసిన ఫిర్యాదుకు మోదీ సర్కారు విలువ ఇవ్వడం, ఆయన్ను కూడా సెలవులో వెళ్లాల్సిందిగా ఆదేశించడం వంటివన్నీ కాంగ్రెస్ పార్టీకి చేజేతులా అందించిన ఆయుధాలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అర్ధరాత్రి పూట ఎమర్జెన్సీ తరహాలో ఆపరేషన్ నిర్వహించి నాగేశ్వరరావును రప్పించడం, అలోక్‌వర్మ కార్యాలయంపై సోదాలు నిర్వహించడం, అస్థానాపై కేసు విచారణ జరుపుతున్న అధికారులు సహా 13 మంది అధికారులను బదిలీ చేయడం, సమాచార ప్రసార శాఖను రంగంలోకి దించి అలోక్‌వర్మపై దుష్ప్రచారం చేయించడం.. వంటి చర్యలన్నీ సీబీఐ మోదీ జేబు సంస్థగా మారిందనే భావన కలగడానికి కారణమవుతున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి.