విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో ఆయన భుజానికి గాయమైన విషయం తెలిసిందే.ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. ఐపీసీ 307 (హత్యాయత్నం) సెక్షన్ కింద కేసు నమోదు చేశామనీ, ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇక విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్ ఇక్కడ సిటిన్యూరో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జగన్ పై జరిగిన దాడిని వైసిపి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇప్పుడు ఒక యువకుడు ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశాడు.మరి అతనెవరు తెలుసుకుందామా.
జగన్ పై జరిగిన కత్తి దాడిని జగన్ అభిమానులు వైసిపి నాయకులు తట్టుకోలేకపోతున్నారు.జగన్ కు యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.290 రోజులపాటు ఆగకుండా యాత్ర చేస్తున్నాడు.ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామానికి ఆయన వెళ్లారు.ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్లి వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం చేస్తున్న మోసాలను వారికి విడమరచి చెప్పాడు.దీంతో ప్రతి ఒక్కరి ఇంట్లో బిడ్డ అయ్యాడు జగన్.ఒక కొడుకుగా అన్నగా తమ్ముడిగా.. ఇలా ప్రతి ఒక్కరి మనసులో స్థానం సంపాదించుకున్నాడు.అయితే ఇప్పుడు జగన్ పై జరిగిన దాడిని వారు తట్టుకోలేకపోతున్నారు.అందుకే ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.
అయితే ఆయన మీద జరిగిన దాడిని తట్టుకోలేని ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.వైజాగ్ కు చెందిన భాస్కర్ అనే యువకుడు జగన్ మీద జరిగిన దాడిని తట్టుకోలేక ఈ పని చేశాడు.అతను వైజాగ్ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు.జగన్ అన్న అంటే అతని ప్రాణం.ఏపీ బాగుపడాలంటే ఒక్క జగన్ వలెనే అవుతుందని నమ్మే వ్యక్తి.ఎప్పుడు స్నేహితుల దగ్గర జగన్ నెక్స్ట్ సీఎం అని చెబుతుండేవాడంట.అయితే జగన్ ను పొడిచిన కత్తికి విషం ఉందని జగన్ పరిస్థితి ఆందోళనలో ఉందని వార్తలు రావడంతో తట్టుకోలేక ఆత్మహత్యాప్రయత్నం చేశాడు.సూసైడ్ లెటర్ కూడా రాశాడు.దాడికి యత్నించిన శ్రీనివాస్ రావుకు ఉరిశిక్ష వెయ్యాలని కోరాడు.అయితే స్నేహితులు అతనిని గమనించి వెంటనే దగ్గరలోని ఒక హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.