విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో ఆయన భుజానికి గాయమైన విషయం తెలిసిందే.ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. ఐపీసీ 307 (హత్యాయత్నం) సెక్షన్ కింద కేసు నమోదు చేశామనీ, ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇక విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్ ఇక్కడ సిటిన్యూరో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఆయనను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఉన్నారు.అందులో ఎన్టీఆర్ ఒకడు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.
జగన్ ప్రస్తుతం సిటిన్యూరో హోస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నాడు.ఆయన తల్లి విజయమ్మ భార్య భారతి ఆయనకు తోడుగా హాస్పిటల్ లో ఉన్నారు.చాలా మంది నాయకులు కార్యకర్తలు జగన్ కోసం హాస్పిటల్ బయట వేచిచూస్తున్నారు.పలువురు ప్రముఖులు లీడర్స్ లోపలికి వెళ్లి పరామర్శిస్తున్నారు.జైపాల్ రెడ్డి బొత్స సత్యనారాయణ,కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి కలిసి పరామర్శించారు.జగన్ కు ఎలాంటి ప్రాణపాయం లేదని తెలిసి అందరు సంతోష పడ్డారు.అయితే జగన్ ను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కలవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.హాస్పిటల్ లో ఉన్న జగన్ ను చూడటానికి ఎన్టీఆర్ స్వయంగా వెళ్ళాడు.అక్కడికి వెళ్లి ఆయనను పరామర్శించాడు.
జగన్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.కత్తి లోపలి దిగిందని సర్జరీ చేశామని అయితే రిపోర్ట్స్ ముంబై పంపించామని అందులో విషం ఉందొ లేదో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తాయని డాక్టర్స్ ఎన్టీఆర్ దగ్గర చెప్పాడు.అయితే జగన్ కు ఏమి కాకుండా జాగ్రత్తగా పరీక్షలు చెయ్యాలని ఎన్టీఆర్ డాక్టర్స్ ను కోరినట్టు తెలుస్తుంది.అయితే ఎన్టీఆర్ జగన్ ను కలిశాడని తెలిసి చంద్రబాబు కొందరు టీడీపీ నేతలు షాక్ లో ఉన్నారు.ఎందుకంటే ఇది టీడీపీ పని అని వైసిపి వాళ్ళు కాదు వైసీపీ వాళ్లే చేపించి నాటకాలు ఆడుతున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు.ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ వెళ్లి జగన్ ను కలవడం టీడీపీ వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది.అయితే స్నేహపూర్వకంగానే ఎన్టీఆర్ వెళ్లినట్టు సన్నిహితులు చెబుతున్నారు.అయితే కొందరు ఏమో ఎన్టీఆర్ అసలు రాలేదని ఇదంతా పుకారు అని అంటున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.