బుల్లి తెరపై జబర్దస్త్ వంటి షోలకు యాంకర్ గా పాపులర్ అయిన రష్మీ వెండి తెరపై కూడా రాణిస్తోంది. గుంటూర్ టాకీస్ వంటి చిత్రాలతో బోల్డ్ పాత్రలకు సై అనేసింది. అవసరమైన గ్లామర్ హొయలు ఒలకబోయడానికి తానెప్పుడూ సిద్ధం అనే సిగ్నల్ ఇచ్చేసింది. యాంకర్ రష్మీ తనపై వస్తున్న రూమర్స్ ని కూడా అంత సీరియస్ గా తీసుకోదు. సోషల్ మీడియాలో అభిమానులు హద్దులు దాటి కామెంట్స్ చేస్తే మాత్రం అంతే ఘాటుగా సమాధానం ఇస్తుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే రష్మి జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు అని అనుకుంటే పొరపాటే. ట్విట్టర్ వేదికగా రష్మిసంచలన విషయాలు వెల్లడించింది.మరి రష్మీ చేసిన ఆ వ్యాఖ్యల గురించి పూర్తీగా తెలుసుకుందామా.
రష్మీ ఈ మధ్య అభిమానులకు దగ్గరగా ఉంటుంది.సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అభిమానులను అప్పుడప్పుడు పలకరిస్తుంది.వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాదానాలు కూడా ఇస్తుంది.ఇలా ఓ మహిళ చేసిన ట్వీట్ కు బదులుగా రష్మిక ఈ విషయాలు బయటపెట్టింది. నా భర్తకు రుమటాయిడ్ జబ్బు ఉంది. ఈ వ్యాధికి ఎలాంటి చికిత్సఉంటుందో తెలియడం లేదు. ఎవరైనా చెప్పండి అని ఓ మహిళ ట్వీట్ చేయగా రష్మీ స్పందించింది. తాను కూడా ఒకప్పుడు ఈ వ్యాధితో భాదపడ్డానని,ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేదు. మన జీవన అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయట పడవచ్చు అని రష్మీ తెలిపింది. ఆయుర్వేద మందులు వాడి చూడండి అని సలహాలు ఇచ్చింది.
12 ఏళ్ల వయసులోనే ఈ వ్యాధి సోకడంతో భయంకరమైన నొప్పి కలిగించే ఇంజెక్షన్లు వాడినట్లు రష్మీ తెలిపింది. దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్ నన్ను వేధించింది. అమ్మ చెప్పిన సలహాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చానని రష్మీ తెలిపింది.రుమటాయిడ్ వచ్చినప్పుడు ప్రతి రోజు వ్యాయామం చేయాలని సూచించింది.ఇటీవల ఆటో ఇమ్యూన్ సమస్య వలన స్టెరాయిడ్లు కూడా తీసుకున్నట్లు రష్మిక తెలిపింది. బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తున్న రష్మీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే బాధగా ఉంది కదా.