Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

Breaking News:టాలీవుడ్‌ ప్ర‌ముఖ నిర్మాత‌ నాగార్జున ఫ్రెండ్ మృతి…షాక్ లో అక్కినేని ఫ్యామిలీ

$
0
0

టాలీవుడ్ కు ఇటీవ‌ల వ‌రుస మ‌ర‌ణాలుక‌లిచి వేస్తున్నాయి ప్ర‌ముఖులు చాలా మంది సీని ప‌రిశ్ర‌మ నంఉచి కాన‌రానిలోకాల‌కు వెళ్లిపోయారు ఇది టాలీవుడ్ కు ఎంతో ఎదురుదెబ్బ అనే చెప్పాలి. తాజాగా కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 62 సంవ‌త్స‌రాలు.. శివ‌ప్ర‌సాద్ రెడ్డి గ‌త కొంత‌కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.. ఈయన ఈ రోజు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.

కామాక్షి మూవీస్ బ్యానర్ ప్రారంభించిన శివ ప్రసాద్ రెడ్డి.. శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, నేనున్నాను, ,ఎదురులేని మ‌నిషి, కింగ్, కేడీ, రగడ, బాస్, దడ, గ్రీకు వీరుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ సినిమాలను నిర్మించారు.చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శనివారం ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు క‌న్నుమూశారు అని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలియ‌చేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవ‌లే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింది. శివప్ర‌సాద్ రెడ్డికి ఇద్ద‌రు కుమారులు. 1987 లో కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించి ఎన్నో హిట్ సినిమాల‌ను నిర్మించారు. శివప్ర‌సాద్ రెడ్డి మృతి ప‌ట్ల తెలుగు సినీ పరిశ్ర‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది…..నాగార్జున‌కు ఆయ‌న‌ ఎంతో మిత్రుడిగా మెలిగేవారు, ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల టాలీవుడ్ ప్ర‌ముఖులు కొంద‌రుక‌న్నీరు మున్నీరు అయ్యారు.

నాగార్జునతో అనుబంధం ఆయ‌న‌కు ఎక్కువ‌గా ఉండేది. తొలుత శోభన్‌బాబుతో సినిమాలు రూపొందించిన శివప్రసాద్ రెడ్డి ఆ తర్వాత కేవలం నాగార్జున అక్కినేనితో ఎక్కువ చిత్రాలు రూపొందించారు. అక్కినేని నాగార్జునతో రూపొందించిన అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. శివప్రసాద్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడటమే కాకుండా ఆయన నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందటంతో సినీ నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కింగ్ తర్వాత కేడీ, రగడ, దడ, గ్రీకు వీరుడు చిత్రాలు ఆశించినంత విజయాన్ని సాధించకపోవడంతో టాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. నాగార్జునతో రూపొందించిన గ్రీకు వీరుడు ఆయన చివరి చిత్రం.
సినిమా చేసే అంత సేపు ఆయ‌న బ్యాన‌ర్ లో ఎవ‌రికి ఏ లోటూ రాకుండా చూసుకున్నారు అని, అలాంటి వ్య‌క్తి లేరు అనేమాట జీర్ణించుకోలేక‌పోతున్నాము అని అన్నారు సినీ ప్ర‌ముఖులు.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles