Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

ప్రేమ పెళ్లి చేసుకున్న అనురాధ హత్య కేసులో సంచలన నిజాలు. అవేంటో తెలిస్తే షాక్..

$
0
0

పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న అనురాధ హత్య కేసులో సంచలన నిజాలు బయటకి వస్తున్నాయి. కూతురి ప్రాణం కంటే తమకు పరువే ముఖ్యమనుకున్న కుటుంబ సభ్యులు, తమ చేతులతో తామే అనురాధను చంపేసినట్టు ఒప్పుకున్నారు. తల్లి చంపేయమనడం ఆలస్యం ఆ తండ్రి గొంతు నులిమేశాడు. అన్నయ్య ఆనవాళ్లు దొరక్కుండా శవాన్ని బూడిడ చేసేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో నిందితులు చెప్తున్న తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు. హత్య కేసులో తండ్రి సత్తన్నపై….. A1గా కేసు పెట్టారు. తల్లి లక్ష్మిని A2గానూ, అన్న మహేశ్‌ను A3గానూ చేర్చారు. వీళ్లకు సహకరించిన మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.మంచిర్యాల జిల్లా కలమడుగు గ్రామనికి చెందిన అనురాధ, లక్ష్మణ్‌ ప్రేమ పెళ్లిని పెద్దలు మొదట్నుంచి వ్యతిరేకించారు. దీంతో ఇంట్లోంచి పారిపోయిన ప్రేమజంట ఈ నెల 3వ తేదీన హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వరంగల్ వెళ్లి అక్కడే కాపురం పెట్టారు. ఐతే పెళ్లికి ముందు అబ్బాయిపై అనురాధతో ఆమె తల్లిదండ్రులు బలవంతంగా పెట్టించిన కేసు విచారణకు వచ్చింది. ఈనెల 23న లక్సెట్టిపేట కోర్టులో అదాలద్‌కు హాజరయ్యారు.

Image result for crime

తర్వాత తిరిగి వరంగల్ వెళ్లకుండా ఊరికి రావడం వాళ్ల పాలిట శాపమైంది. ఐతే ఇంటికి వెళ్లేముందే PSకి వెళ్లిన అనురాధ, లక్ష్మణ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో అనురాధ పేరెంట్స్‌ను కౌన్సెలింగ్‌కి పిలిచారు. తర్వాతి రోజు వస్తామంటూ వాళ్లు మాట దాట వేశారు. సరే విషయం రేపు చూద్దామంటూ పోలీసులు వాళ్లను ఇంటికి పంపించారు. రాత్రికి అనురాధ, లక్ష్మణ్ ఇంటికి వచ్చిన విషయం తెలిసి, ఆ క్షణమే ఆమెను చంపేయాలని ప్లాన్ చేశారు కుటుంబ సభ్యులు.అనురాధ తండ్రి సత్యయ్య, తల్లి లక్ష్మి, అన్న మహేశ్‌తో మరికొందరు లక్ష్మణ్ ఇంటిపై దాడి చేసి అమ్మాయిని లాక్కెళ్లారు. కులం కాని వాడిని ప్రేమించిందంటూ విపరీతంగా కొట్టారు. లక్ష్మణ్‌ను మర్చిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఆమె కుదరని చెప్పడంతో పిచ్చి కోపంలో మరోసారి దాడి చేశారు. కళ్లుతిరగి పడిపోయిన అనురాధను బైక్‌పై కూర్చోబెట్టుకుని నిర్మల్‌ జిల్లా మల్లాపూర్‌ చేరుకున్నారు.

అక్కడ మరోసారి బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. తల్లి లక్ష్మితో ఫోన్‌లో మాట్లాడించారు. నచ్చచెప్పించారు. ఐనా వినకుండా తాను భర్తతోనే ఉంటానని అనురాధ తేల్చి చెప్పంతో తల్లి కూడా కూతురిని చంపేయాలన్న మాటకే మద్దతిచ్చింది. భర్తకు అదే విషయం చెప్పింది. ఆ వెంటనే సత్తయ్య గొంతు నులిమి అనురాధను చంపేశాడు. తర్వాత అన్న మహేష్ కట్టెలు తెచ్చి శవాన్ని కాల్చేశాడు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉండి శవం పూర్తిగా కాలిపోయాక ఆనవాళ్లు లేకుండా బూడిడ సహా అంతా ఎత్తి పక్కన ఉన్న కాల్వలో పడశాడు.తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని అనురాధ ముందే ఊహించింది. ఓ వీడియోలో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు, కులస్తులు, సర్పంచ్ వలన తమకు ప్రాణ హాని వుందని ఆ వీడియో కాల్‌లో అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు స్పందించి వచ్చే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కులం కోసం పరువు కోసం కన్నబిడ్డల్నే చంపుకున్న ఈ తల్లిదండ్రుల్ని చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించకుంటోంది.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు. ప్రేమ పెళ్లి చేసుకున్న అనురాధను సొంతవాళ్లే హత్య చెయ్యడం గురించి అలాగే వారు చంపినా విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles