Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

కలెక్టర్ భార్యపై అసభ్యకర కామెంట్లు ఆ యువకుడ్ని కలెక్టర్ ఏం చేశాడో తెలిస్తే మతిపోవడం ఖాయం …

$
0
0

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది అని, అన్ని సోష‌ల్ మీడియా అకౌంట్లలో ఖాతాలు ఉన్నాయి అని ఇష్టం వ‌చ్చిన రీతిలో కామెంట్లు తీస్తే బెండు తీస్తారు పోలీసులు.. తాజాగా ఇలాంటి ఓ స్టోరీ జ‌రిగింది క‌ల‌క‌త్తా న‌గ‌రంలో…తన భార్యపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేసినందుకు ఓ యువకున్ని పోలీస్‌ స్టేషన్‌లోనే చితకబాదాడు పశ్చిమబెంగాల్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారి. యువకుడు క్షమించమని వేడుకున్నా పట్టించుకోకుండా చితక్కొట్టారు. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

అలీపూర్‌ద్వార్ జిల్లాకు చెందిన ఐఏఎస్‌ అధికారి నిఖిల్‌ నిర్మల్‌ భార్యపై అదే ప్రాంతానికి చెందిన వినోద్‌ కుమార్‌ సర్కార్‌ అనే యువకుడు సోషల్‌ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేశాడు. దీంతో ఆ యువకుడిపై నిఖిల్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని యువకున్ని అరెస్ట్‌ చేశారు. గత ఆదివారం ఐఏఎస్‌ అధికారి నిఖిల్‌ తన భార్య నందిని కిషన్‌తో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అత‌ను అక్క‌డ ఉన్నాడు అని తెలియ‌డంతో క‌లెక్ట‌ర్ కుటుంబం అక్క‌డికి వెంట‌నే వెళ్లారు.ఆవేశంతో ఆ యువకున్ని చితకబాదాడు. క్షమించండి అంటూ ఆ యువకుడు ప్రాధేయపడుతున్నా వినలేదు. అధికారి భార్య కూడా యువకున్ని కొట్టారు. ఇదంతా అక్కడ ఉన్నవారిలో ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్‌ అయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాగా ఓ ఐఏఎస్‌ అధికారి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి యువకున్ని కొట్టడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబట్టారు. పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి కొట్టడానికి ఐఏఎస్‌కి హక్కులేదని ఏపీడీఆర్‌ సభ్యురాలు జతీశ్వర్‌ భారతి అన్నారు. తన భార్యపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ, ఆయన వెళ్లి కొట్టడం ఏంటని ప్రశ్నించారు. చట్టం ప్రకారం వ్యవహరించాలి కానీ భార్యతో కలిసివెళ్లి కొట్టడం, చంపేస్తానని బెదిరించడం నేరమని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై వివరణ కోసం ఐఏఎస్‌ అధికారిని మీడియా సంప్రదించగా అందుబాటులోని రాలేదు. మరిత‌న జిల్లాలో నువ్వు నా భార్య‌పైనే కామెంట్ చేస్తావా అని ఆయ‌న ఆవేశంతో ఊగిపోతూ అత‌న్ని చావ‌బాదాడు. అయితే క‌లెక్ట‌ర్ చేసిన ప‌నిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles