“పుట్టినవాడికి మరణం తప్పదు…మరణించినవాడు జన్మించకతప్పదు..”అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు,అర్జునుడికి చెప్పడం జరిగింది. పునర్జన్మలు ఉన్నాయని కొంతమంది గట్టిగా నమ్ముతున్నా, అవన్నీ అభూతకల్పనలని కొట్టిపారేసేవారూ చాలామంది ఉన్నారు. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే అలాంటి వారు కూడా పునర్జన్మలు ఉన్నాయని తప్పకుండా నమ్మి తీరతారు. ఇది నిజంగా జరిగిన యథార్థగాథ. ఈ సంఘటనకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వచ్చేదాకా ఎవ్వరికీ తెలియదు.మరి ఆ యధార్థగాథేమిటో పూర్తీగా తెలుసుకుందామా..
థాయ్ లాండులో ఒకమ్మాయి 5 సంవత్సరాల క్రితం యాక్సిడెంటుకి గురి అయ్యి, నెలరోజులు మృత్యువుతో పోరాడిన తర్వాత చనిపోయింది.ఆమెకి ఒక ప్రియుడు ఉన్నాడు. ఆ అమ్మాయి చనిపోకుండా ఉంటే ఆమె ఆ కుర్రాడి భార్య అయ్యుండేది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు విధివారిద్దరినీ వేరు చేసింది. ఆ యువతి అతన్ని విడిచి వెళ్లిపోయింది. ఆ యువతి జ్ఞాపకాలు కొంతకాలం వరకూ ఆ యువకుణ్ణి వెంటాడుతూనే ఉన్నాయి. రెప్పవేసినా, తెరచినా ఆమే గుర్తొచ్చేది. ఆ అమ్మాయిని మరచిపోలేక ఆ యువకుడు పిచ్చివాడు అయిపోతాడెమోనని పెద్దలు బాధపడ్తూ ఉండేవారు. ఆ యువతి జ్ఞాపకాలనుంచి, అతను బయట పడాలంటే ఆ యువకుడికి వేరే అమ్మాయినిచ్చి పెళ్లిచెయ్యాలనుకున్నారు. కానీ ప్రేయసి జ్ఞాపకాలనుంచి బయటపడ్డం అతనికి ఇష్టంలేక ఆ పెళ్లిని నిరాకరించాడు. కాలగమనంలో 5 యేళ్లు నిండిపోయాయి. ఆ యువతి మరణం గురించి దాదాపు అందరూ మర్చిపోయారు.ఆమె ప్రియుడు కూడా ఆమెని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. హఠాత్తుగా ఓరోజు రాత్రి అతనికలలో అతని ప్రేయసి కనిపించి నేను మళ్లీ పుట్టాననీ నీపై ప్రేమతో నీ వెనుకే తిరుగుతున్నాననీ, నా ఆత్మ నిన్ను మరచిపోలేకపోతోందనీ, కానీ నిన్ను కలవాలంటే సందేహిస్తున్నాననీ దానికి కారణం నేను ప్రస్తుతం పామురూపంలో జన్మించాననీ చెప్పింది.
నేను కనిపిస్తే నువ్వు భయపోడి పారిపోతావేమోననే నీ దగ్గరికొచ్చినా నిన్ను కలవడంలేదని చెప్పింది. నువ్వు ఎక్కడికెళ్లినా నేను నీ వెనుకే తిరుగుతున్నానని చెప్పింది. వెంటనే తేరుకున్న అతను,ఆ మాటల్ని గుర్తుచేసుకున్నాడు.ఆ రాత్రివేళ వెంటనే అతను బయటికి వెళ్లి చూడగా గోడ దగ్గర ఒకపాము కనిపించింది.ఆ పాముదగ్గరికి వెళ్లగా, ఆ పాము వెనక్కి వెళ్లి అక్కడి పోదల్లో దూరింది. అతను చుట్టూ పక్కల వెతికినా ఆ పాము కనిపించలేదు. దాంతో అక్కడె కూర్చొని దు:ఖిస్తూ, తన ప్రేయసిని తలచుకొని ఆమెని తన దగ్గరికి రమ్మని పిలిచాడు.అతని పిలుపు విన్న్న పాము ఆ పొదల్లోంచి బయటకి వచ్చి ఆ యువకుడి పాదాల దగ్గరికి వెళ్లి నిలుచుంది. ఆ పాముని చేతులతో తీసుకొని ఒడిలో పెట్టి ముద్దులాడాడు.ఆ పాముని ప్రేమగా నిమిరాడు.పాముని ఇంట్లోకి తీసుకెళ్లి తనబెడ్ పై పడుకోబెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తన ప్రేయసి పాముగా జన్మించిందనీ, ప్రస్తుతం తనతోనే ఉందని స్నేహితుడికి చెప్పాడు. దాంతో ఆ స్నేహితుడు షాక్ తిన్నాడు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత, ఆ యువకుడి దగ్గరికి వెళ్లాడు. ఆ యువకుడు పాముతో కలిసి, బెడ్ పై ఆడుకుంటున్న విషయాన్ని గ్రహించిన స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. సాధారణంగా మనుషుల్నిచూడగానే పాములు కాటువెయ్యడమో, పారిపోవడమో చేస్తాయి. ఆ పాము అతనితో కలిసి ఉండడం చూసిన స్నేహితుడు, ఆ పాముని అతని ప్రేయసిగానే భావించాడు. స్నేహితుడు చెప్పిన విషయాల్నినమ్మాడు. ఆ విషయాలన్నింటినీ సోషల్ మిడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారింది. ప్రపంచమంతా ఆ విషయం తెలుసుకొని ఆ ప్రేయసీ ప్రియుల అమర ప్రేమ గురించి గొప్పగా చెప్పుకోసాగారు. పాముగా జన్మించికూడా, తన ప్రేమని మర్చిపోలేదని ఆ యువతిని కొనియాడుతున్నారు..మరి ఈ విషయం గురించి మీరేమంటారు. నిజంగానే ప్రేయసి పాము రూపంలో వచ్చిందా..లేక ఆ పాముకు యువకుడిని మధ్య వేరే కథ ఏమైనా ఉండి ఉంటుందా.. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.