తెలంగాణ లో జరిగిన పరువు హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు. ఆ ఘటన తరువాత ప్రణయ్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే రెండు రోజుల క్రితం అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ప్రణయ్ కుటుంబంలో మళ్ళి ఆనందం వెల్లివిరిసింది. ప్రణయ్ మళ్ళి పుట్టాడని అందరు అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ, ఆ దేవుడి దయ వల్ల తన కోడలు, మగ శిశువు క్షేమంగా ఉన్నారని అన్నారు. తమ కోడలు ఆరోగ్యం, ఆమెకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా నెలరోజుల క్రితం హైదరాబాద్ వచ్చామని అన్నారు. ఈ నెల రోజులు కూడా ఎవరికంట పడకుండా చాలా జాగ్రత్తగా, పోలీసుల రక్షణలో ఉన్నట్టు చెప్పారు. పోలీసులు, మీడియా వల్లే తమ కుటుంబం ఈరోజు బతికుందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఏడాది పాటు తమ కుటుంబం ఎంతో వేదన అనుభవించిందని, ప్రణయ్ హత్య తర్వాత కూడా తమపై వేధింపులు కొనసాగాయని చెప్పుకొచ్చారు. తమ కోడలు అమృతను కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న విషయాన్ని చెప్పారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అయితే ఇప్పటికి కూడా మారుతీరావు కుటుంబం నుంచి మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇంటికి రమ్మని అమృత కుటుంబ సభ్యులు పిలుస్తున్నారు. అయితే అమృత వెళ్ళడానికి అంగీకరించడం లేదు. అయినా కానీ అమృత అమ్మ బ్రతిమలాడుతుంది. ఈ సందర్భంగా మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అమృతకు ఒకవేళ వెళ్లాలని అనిపిస్తే వెళ్ళమని చెబుతున్నాం. ఎందుకంటే నా కొడుకు చనిపోవడం వల్ల ఆ అమ్మాయి ఒంటరిగా జీవితాంతం జీవించడం మాకు కూడా ఇష్టం లేదు. అయితే ఒకవేళ అలా వెళ్లాలనుకుంటే మాత్రం పుట్టిన బిడ్డను మా దగ్గరే పెట్టుకుంటాం. ఎందుకంటే ప్రణయ్ ను చంపిన ఆ కుటుంబం ఈ బిడ్డను బ్రతకనిస్తారని గ్యారెంటీ లేదు. అందుకే వెళ్లాలనుకుంటే బిడ్డను వదిలేసి వెళ్లాలని చెప్పారు. ఈ విషయం విన్న అమృత ఒక్కసారిగా షాక్ అయ్యింది. నేను ఎట్టి పరిస్థితిలో వీళ్ళను వదిలి వెళ్ళను. నా జీవితాంతం నా బిడ్డను చూసుకొని బ్రతుకుతా అని అమృత చెప్పింది. అమృత మాటలు విన్న ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారంట. పుట్టిన బిడ్డతో అమృత సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ప్రణయ్ తండ్రి చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీ అభిరాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.