మహిళలు లైంగికంగా పురుషుడితో కలిసినా వారికి గర్బం రాకుండా ఇప్పుడు అనేక సాధనాలు వచ్చాయి.. అయితే గర్భనిరోధక మాత్రలను ఎక్కువగా తీసుకుంటున్నారు మహిళలు, ఇది ఇన్ స్టెంట్ గా వారికి సంతృప్తిని ఇచ్చినా, వీటి వల్ల ఆరోగ్యం క్షిణిస్తుంది అని చెబుతున్నారు డాక్టర్లు… ఈ పిల్స్ గురించి డాక్టర్లు చెప్పే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం….రోజుకొక గర్భనిరోధక మాత్రను మింగితే పీరియడ్స్ సమయంలో కలిగే రక్తస్రావాన్ని, నొప్పిని నివారించవచ్చు, ఇటీవల కొన్ని వార్తాపత్రికల్లో వార్త వచ్చింది.ఇలా రోజూ మాత్రలు మింగాలని తాము చెప్పలేదని, తమ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ దాన్ని ఖండిస్తూ వెంటనే సంబంధిత వర్గాలనుంచి ప్రకటన వచ్చింది…కొందరికి ఆశించిన ఫలితాలు ఇచ్చినప్పటికీ మహిళలందరికీ ఇది మంచిది కాదు” అని ది ఫ్యాకల్టీ ఆఫ్ సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్‌కేర్ తెలిపింది.ఈ పిల్ వాడేముందు తప్పనిసరిగా డాక్టర్లతో సంప్రదించి, తమకు తగిన వాటిని ఉపయోగించాలని సూచించింది.
అసలు ఈ పిల్ గురించి తెలుసుకుందా..కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్… దీన్నే సింపుల్‌గా పిల్ అంటున్నారు. దీనిలో మహిళల్లో గర్భధారణకు అవసరమైన అండం విడుదల కాకుండా నిరోధించే హర్మోన్లు ఉంటాయి. దీన్ని సరైన మోతాదులో తీసుకుంటే 99శాతం ఫలితాలనిస్తుంది.ఎన్నో బ్రాండ్లు దీన్ని తయారు చేస్తున్నాయి.. పీరియడ్స్ తర్వాత రోజుకొకటి చొప్పున మూడు వారాలపాటు దీన్ని వేసుకోవాలి. చివరి వారం ఎలాంటి మాత్రలూ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాలుగోవారంలో సాధారణంగా మళ్లీ పీరియడ్స్ వస్తాయి.కొన్ని గర్భనిరోధక సాధనాల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోనుతో ఇబ్బందులు ఉన్న మహిళలు ప్రొజెస్టిరాన్ హార్మోను ఉన్న మాత్రలను వేసుకోవచ్చు. వీటిని ‘మినీ పిల్’ అని పిలుస్తారు. ఇది కూడా మూడువారాల పాటు రోజూ వాడాలి.సూచించిన విధానంలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తేనే ఈ పిల్ సరైన ఫలితాలనిస్తుందంటున్నారు పరిశోధకులు. సూచించిన సమయానికి 24 గంటలు ఆలస్యంగా ఈ పిల్ వేసుకుంటే, ఇంక వేసుకోనట్లే లెక్క. అయితే ఇది ప్రొజెస్టిరాన్ పిల్‌కు మాత్రం వేరే విధంగా ఉండొచ్చు.కొంతమంది మూడువారాలు వేసుకుని, ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా రోజూ ఈ పిల్ వాడుతూ ఉంటారు.
అయితే వారం ఆపడం వల్ల ఆరోగ్యానికి అదనంగా ఎలాంటి ప్రయోజనాలు కలగవని ఎఫ్ఎస్ఆర్‌హెచ్ చెబుతోంది.కానీ, కొందరు ఈ వారం రోజుల వ్యవధిని గుర్తుపెట్టుకోలేక, అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి రోజూ ఈ పిల్‌ను తీసుకుంటూ ఉంటారు.చాలా మంది మూడువారాలు టాబ్లెట్ వేసుకోవడం, ఒకవారం మానేయడం… ఇదే పద్ధతిని పాటిస్తారు. రుతుస్రావం జరిగింది అంటే తాము గర్భం ధరించలేదు అనే నమ్మకాన్ని పొందడానికే ఇలా చేస్తుంటారు అయితే, రుతుస్రావం జరిగినంత మాత్రాన గర్భం రాదు అనుకోవడానికి లేదు. మన శరీరంలో గర్భనిరోధక రసాయనాలు ఏమీ లేవు అనడానికి అదో సంకేతం మాత్రమే అని డాక్టర్లు స్పష్టం చేశారు.ఒకవేళ నెలనెల పీరియడ్స్ రాకపోతే నెలసరిలో పోవాల్సిన రక్తం శరీరంలో నిల్వ ఉండిపోతుంది అనే అపోహలు కూడా ఉన్నాయి.కానీ అది నిజం కాదు. పీరియడ్స్ వద్దు అనుకుంటే ఆపేసుకునే అవకాశం కూడా ఉంది అని డాక్టర్లు తెలియచేస్తున్నారు..ఇవి లైంగిక వ్యాధులని నిరోధించలేవు, ఒక్కోసారి రక్తం గడ్డకట్టడం, బ్రెస్ట్ కేన్సర్ వంటి తీవ్ర సమస్యలకుకూడా దారితీయవచ్చు.మనుషులంతా ఒకేలా ఉండరు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అలాగే గర్భనిరోధక పద్ధతులు కూడా అందరికీ ఒకేరకంగా ఉండవు. వైద్యుల సలహాలు, మహిళల ఆరోగ్య స్థితిని బట్టి వీటిని ఎంచుకోవాలి . ఈ మందులు అందరు మహిళలకు పడకపోవచ్చు. 35 సంవత్సరాల పైబడిన, పొగ తాగే మహిళలకు లేదా ఇతర అనారోగ్య సమస్యలున్నవారు ఇవి ఉపయోగించకూడదని అన్నారు. అలాగే గర్భవతులు కూడా ఈ పిల్ వాడకూడదని హెచ్చరించారు.ఒక రోజు ఆలస్యంగా తీసుకోవడం, పిల్ వేసుకున్న రెండు గంటల్లో వాంతులు చేసుకోవడం, తీవ్రమైన డయేరియా, అలాగే పిల్ ప్రభావాన్ని తగ్గించే కొన్ని రకాల మందుల వాడకం ఇలాంటి సందర్భాల్లో ఈ పిల్ సరిగ్గా ప్రభావం చూపించకపోవచ్చు. ఇక ఇలా మూడు నెలలు పిల్స్ వాడి తన శరీరానికి పడక ఆమెకు క్యాన్సర్ వచ్చింది, దీంతో ఇనిషీయల్ స్టేజ్ లో ఆమెకి ఈ వ్యాధి ఉంది అని గుర్తించారు డాక్టర్లు, ఇప్పుడు ఆరునెలల చికిత్స తర్వాత ఆమె మాములు మనిషి అయింది, అందుకే ఇలాంటి సాధణాలు వాడే సమయంలో తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలి అని చెబుతున్నారు, మరి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.