సకల దేవతగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలి పూజ గణనాధునికే. ఆయన అనుగ్రహాం పొందితే అన్ని కార్యం జయమవుతుంది. హిందూ సంప్రదాయాల్లో అతి పెద్దదైన, ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ పండుగ తర్వాతనే మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. భాద్రపద శుక్ల చవితి రోజున వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ పండుగను ఎంతో పవిత్రతో చేసుకోవాలి.అయితే ఈసారి వినాయకచవితిలో ఒక విషయాన్నీ మీరు గమనించారా.వినాయకుడు ఈసారి ఎక్కడ పాలు తాగలేదు.ప్రతిసారి ఎక్కడో ఒకచోట పాలు తాగే వినాయకుడు ఈసారి ఎక్కడ తాగలేదు.అసలెందుకు తాగలేదు.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయక చవితి వచ్చింది.వినాయకుడి నవరాత్రులు కూడా అయిపోతున్నాయి.ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట పాలు తాగి భక్తులకు నేను ఉన్నా అని చెప్పే వినాయకుడు ఈసారి ఎందుకు ఎక్కడ పాలు తాగలేదు.దీనికి కారణం ఏమిటి..ఏమి లేదు వినాయకుడికి కోపం వచ్చింది.మీరు నమ్మిన నమ్మకపోయినా ఆయనకు మన మీద ప్రేమ తగ్గిపోయింది.వినాయకుడికి కోపం రావడం ఏమిటి..ఇదేమి చోద్యం అని కొట్టిపారేయకండి.వినాయకుడికి కోపం రావడానికి ఒక కారణం ఉంది.గతంలో వినాయకచవితి అంటే ఊరికి ఒక మండపం పెట్టేవాళ్ళు.తర్వాత గల్లీకి ఒక మండపం అయ్యింది.ఆ తర్వాత ఒక్కొక్క వర్గానికి ఒక్కక్క మండపం అయ్యింది.ఇప్పుడు అపార్టుమెంట్ కు ఒక మండపం అయ్యింది.దీని వల్లనే వినాయకుడికి కోపం వచ్చింది.దీని వలన ఎందుకు కోపం వచ్చింది అనుకుంటున్నారా..వినాయకచవితికి ఎందుకు జరుపుకుంటామో మనలో ఎవరికైనా తెలుసా..ఆ నవరాత్రులు ఊరికి ఒక వినాయక విగ్రహాన్ని పెట్టి అందరు ఒకచోట చేరి పూజలు చేసి కలిసుంటారని ఈ పండుగను జరుపుకుంటారు.కానీ ఇప్పుడు ఎవరికిష్టం ఉన్నట్టు వాళ్ళు విడివిడిగా వినాయకుడిని పెట్టుకుని పూజిస్తున్నారు.దీంతో మనుషులు దూరం అవుతున్నారు.దీనికే దేవుడికి కోపం వచ్చింది.
ఒకరు 30 అడుగులు పెడితే మరొకరు వారికి పోటీగా 40 అడుగుల బొమ్మ పెడతారు.ఇలా మనుషుల మధ్య దూరంపెరుగుతుంది.ఇక్కడ పోటీ ఉంది కానీ భక్తి లేదు.కలిసుంటారని పండుగ జరుపుకోమంటే ఇలా విడిపోయి చేసుకుంటారా అని వినాయకుడు భక్తుల మీద కోపం తెచ్చుకున్నాడు.ఈసారి వినాయకుడు ఎందుకు పాలు తాగలేదో తెలుసా..మనం పెట్టె వినాయకుడు తాగలేడు కాబట్టి తాగలేదు అంతే..మట్టితో చేసే వినాయకుడు పెడితే విగ్రహాలలో ఉండే మట్టి ద్రవాలను శోషించుకోగలదు.మనం పెట్టె ప్లాస్టిక్ విగ్రహాలు ద్రవాలను తీసుకోవు.అందుకే ఈసారి వినాయకుడు పాలు తాగలేదు.ఈసారి ఎక్కడ కూడా ఒండ్రు మట్టి వినాయకుడిని పూజించలేదు కాబట్టి ఎక్కడ వినాయకుడు పాలు తాగలేదు.అది సంగతి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.