ప్రతి మనిషికి రహస్యాలు అనేవి ఉంటాయి. అవి రహస్యంగానే ఉంచుతేనే వాళ్లకు మంచిది. లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రహస్యాలను ఎవరికీ చెప్పొద్దూ అని అంటారు. అయితే నోటిలో మాటలు ఆగక ఎవరికీ పడితే వాళ్లకు చెప్తూ ఉంటారు. అయితే ఎవరికీ చెప్పినా కూడా కొందరు వ్యక్తులకు మాత్రం అస్సలు చెప్పకూడదంట. మరి ఎలాంటి వ్యక్తులకు రహస్యాలను చెప్పకూడదో ఇప్పుడు చూద్దాం.

- మూర్ఖుడు…
సమయం సందర్భం లేకుండా ప్రవర్తించే వ్యక్తులను మూర్ఖులుగా చెప్పవచ్చు. ఇటువంటి వ్యక్తులతో కలవడం మంచిది కాదు. వీళ్లకు ఉన్న బుద్ది వలన మన రహస్యాలను ఇతరులకు చెప్పే అవకాశం ఉంది. ఏ మనిషికి అయినా వచ్చే అనేక సమస్యలకు ముఖ్య కారణం మూర్ఖుల వద్ద వాళ్ళ రహస్యాలను చెప్పడమే. కాబట్టి మూర్ఖుల లాంటి వ్యక్తులతో స్నేహం చెయ్యకండి. ఒకవేళ స్నేహం చేసినా కూడా వారి దగ్గర మీ రహస్యాలను చెప్పకండి.

- స్త్రీలు…
స్త్రీలు వాతావరాన్ని బట్టి మారుతూ ఉంటారు. వీళ్లకు వ్యతిరేక భావనలు ఎక్కువ ఉంటాయి. మాటను మనసులో పెట్టుకోలేరు. అందుకే వీళ్లకు రహస్యాలు చెప్తే వాటిని బయటపెడతారు. కర్ణుడు కూడా ధర్మరాజు విషయం దాచినందుకు కుంతీదేవిని ఉద్దేశించి మహిళల నోట మాట దాగదు అనే శాపం ఇచ్చినట్టు మహాభారతంలో రాసి ఉంది. ఆడవారి నోట్లో మాటలు ఆగవు అని కూడా ఒక సామెత ఉంది కాబట్టి ఆడవారి దగ్గర రహస్యాలను చెప్పకూడదు.

- చిన్న పిల్లవాడు…
చిన్న పిల్లవాడికి సరైన అవగాహన ఉండదు. ఎవరు ఏమి అడిగినా కూడా వాళ్ళు దాచుకోకుండా చెప్తారు. అది మంచికా, చెడుకా అని కూడా ఆలోచించరు. కాబట్టి చిన్న రహస్యాలను వీరికి కొంచెం దూరంలో ఉంచడమే మంచిది. కాబట్టి చిన్న పిల్లల వద్ద ఎట్టిపరిస్థితిలో చెడుగా చెప్పకండి. ఇలాంటి విషయాలు వారిలో చెడు మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఈ క్రింద వీడియో చూడండి
- అత్యాశాపరుడు…
అత్యాశాపరుడు తన బలహీనతను బలంగా మార్చుకోవాలనే దురాశతో ఉంటాడు. ఇతరుల విషయాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. లాభాల కోసం వంచనకు పాల్పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇటువంటి అత్యాశాపరుడు మీ స్నేహితులలలో ఉంటె వీరికి దూరంగా ఉండటం మేలు. వీరి దగ్గర ఎటువంటి రహస్యాలను చెప్పకుండా ఉండటమే మంచిది. వీళ్ళు రహస్యాలను గోప్యంగా ఉంచుతారనే నమ్మకము లేదు.
ఇలా ఈ నలుగురి వ్యక్తుల వద్ద ఎటువంటి రహస్యాలను చెప్పకండి. చెప్తే మీకే నష్టం. మరి మేము చెప్పిన విషయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post ఈ 4 రకాల వ్యక్తులకు మీ రహస్యాలను చెప్పేముందు జాగ్రత్త… appeared first on Telugu Messenger.