మనకు ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా మనం వెంటనే వెళ్ళేది హాస్పిటల్ కు. ఎందుకంటే ఆ రోగాన్ని నయం చేయగలిగే సత్తా వాళ్ళకే ఉంటుంది. ఇక ఆపరేషన్ లాంటివి అయితే చెయ్యి తిరిగిన డాక్టర్స్ మాత్రమే చెయ్యగలుగుతారు. అయితే యూట్యూబ్ చూసి ఎవరైనా ఆపరేషన్ చెయ్యగలుగుతారా చెప్పండి లేదు కదా. యూట్యూబ్ అనేది జస్ట్ ఇంఫార్మేషన్ తెలుసుకోడానికి ఎంటర్ టైన్మెంట్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఏకంగా ఆపరేషన్ చెయ్యడానికి పనికి వస్తుందా చెప్పండి. యూట్యూబ్ లో వీడియో చూసి ఆపరేషన్ చెయ్యడం వీలవుతుందా అంటే అస్సలు వీలవ్వదు కదా..కానీ మేము చేస్తాం అని చెప్పి సొంత కొడుకుకు ఆపరేషన్ చెయ్యడానికి పూనుకున్నారు ఆ పిల్లాడి తల్లిదండ్రులు. మరి తర్వాత ఏమైందో తెలుసుకుందామా.
బెంగళూరు నగరానికి చెందిన ఓ యువజంట బిడ్డ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వారు నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పైగా, బాబుకు ఆపరేషన్ అవసరమని తల్లిదండ్రులే నిర్ధారించి.. తామే సర్జరీ చేసుకుంటామని.. ఒక నర్సు సహాయం చేస్తే సరిపోతుందని డాక్టర్లని కోరారు. వీరి మాటలకు ఒక్కసారిగా వైద్యులతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. పైగా, ‘మాకు డాక్టర్లపై నమ్మకం లేదు. మేము వారి ఫీజును భరించేస్థాయిలో లేము. యూట్యూబ్ లో వీడియో చూసాం. మాకు సర్జరీ చేయడం వచ్చు’ అని పేషంట్ తల్లిదండ్రులు వైద్యులతో గొడవకు దిగారు. ఈ విషయం మెల్లగా మీడియాకు చేరింది. దీంతో మీడియా అంతా అక్కడకు చేరుకోవడంతో జరిగిన విషయాన్ని వైద్యులు వివరించారు.
యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్ చేస్తామనడం దారుణమని ఇలాంటి చర్యలు సమాజానికి మంచివి కావని తెలిపారు. ట్రీట్మెంట్ చేయడానికి సర్టిఫైడ్ డాక్టర్ అవసరమన్నారు. డాక్టర్ చెయ్యకుండా ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఎక్కడో ఓ చోట అధిక ఫీజు వసూలు చేస్తే అందరినీ అలాగే చూడటం సరికాదు. డబ్బులు లేవంటే ఆపరేషన్ చెయ్యకుండా వదిలేసే టైపు మేము కాదని ఆ ఆపరేషన్ కు తగిన డాక్టర్ ను తీసుకొచ్చి ఆ పిల్లాడికి ఆపరేషన్ చేపిస్తామని మీడియాకు తెలిపారు.చూశారుగా ఈ తల్లిదండ్రులు ఎంతటి సాహసానికి పాల్పడాలనుకున్నారో. తొందరపడి నిజంగానే ఆపరేషన్ చెయ్యడానికి ప్రయత్నించి ఉంటె వారి ప్రాణాలే పోయి ఉండేవి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.యూట్యూబ్ లో వీడియో చూసి ఆపరేషన్ చేస్తామని అన్న ఈ తల్లిదండ్రుల గురించి అలాగే ఇలా యూట్యూబ్ చూసి విచిత్ర సాహసాలకు పాల్పడే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.